Chiranjeevi : శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు చిరంజీవి సహాయం..!

November 26, 2021 11:05 PM

Chiranjeevi : ప్రముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ కరోనాతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం విషమంగానే ఉంది. ఆసుప‌త్రి ఖ‌ర్చులు ల‌క్ష‌ల‌లో అవుతున్న నేప‌థ్యంలో చిన్న‌కుమారుడు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరాడు. ఇప్పటికే సోనూసూద్, కోలీవుడ్ హీరో ధనుష్ లు శివ శంకర్ మాస్టర్ కు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారు.

Chiranjeevi given rs 3 lakhs to shiva shankar master family

శివ శంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న చిరంజీవి వెంట‌నే శివ‌శంక‌ర్ మాస్టార్ త‌న‌యుడికి కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి.. శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అంతేకాక వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడు అజ‌య్ మాట్లాడుతూ.. చిరంజీవి అంటే నాన్న‌గారికి చాలా ఇష్టం. ఇటీవల ఆచార్య షూటింగ్‌ లో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. శివ శంక‌ర్ మాస్టార్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ‌ళ్లీ ఆయ‌న తిరిగి సినిమాలు చేయాల‌ని.. అభిమానులు కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now