Chiranjeevi : ఆ హీరోయిన్ తో నటించాలంటే చిరు నరకం అనుభవించే వాడు.. సీనియర్ జర్నలిస్ట్ రామారావు

October 21, 2022 8:25 AM

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించారు. కెరీర్ లో ఇంత సక్సెస్ చూసినా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఆయన ఎన్నడూ ఒకరిని గట్టిగా విమర్శించడం, తిట్టడంలాంటివి చేయలేదు. ఇక మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎందరో కలలుగంటారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి లైఫ్ లో ఇద్దరు హీరోయిన్లు మాత్రం చిరుతో వింతగా ప్రవర్తించారట.

సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు నటి మాధవి గారి ప్రవర్తన గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ చిరంజీవికి ఒక మైలురాయి లాంటిది. ఇందులో హీరోయిన్ గా మాధవి గారు నటించారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన పున్నమినాగు కూడా సూపర్ హిట్. ఇప్పటికీ రగులుతోంది మొగలిపొద పాట వింటూనే ఉన్నాం.. అలాంటి ఈ హిట్ పెయిర్ కి చిన్నవివాదం ఉంది. నిజానికి చిరంజీవి గారు అప్పట్లో నటించిన హీరోయిన్స్ అందరితో ఇప్పటికీ తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన మాధవిగారితో నటించడానికి చాలా ఇబ్బంది పడేవారట.

Chiranjeevi felt problems with that actress when film shooting
Chiranjeevi

దీని కారణం ఆయనతో మాధవి గారు డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడమే. మాధవి గారు సినిమాల్లో నటించాలి.. అగ్రతారగా ఎదగాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి రాలేదట. ఇక ఇంట్లో వాళ్ళు కుడా సినిమాల్లో ఎవరితోనైనా చనువుగా ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, పెళ్లిలాంటివి ఇబ్బంది అవుతాయి అని ఆలోచించేవారట. అందువల్ల ఆమె సినిమా వాళ్లేవరితో ఎక్కువగా మాట్లాడేది కాదట. ఇక అలా చిరునే స్వయంగా.. నాతో మాట్లాడండి, క్లోజ్ గా ఉండండి  సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అపుడు ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అంటూ చెప్పినా ఆమె దూరంగానే ఉండేవారట. దీంతో ఆమెతో నటించాలంటే నరకంగా ఉండేదని చిరంజీవి స్వయంగా చెప్పారని రామారావు గారు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment