Koratala Siva : గాడ్ ఫాద‌ర్ హిట్ టాక్‌.. కొర‌టాల‌ను ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌..!

October 6, 2022 11:37 AM

Koratala Siva : ఆచార్య సినిమా కొర‌టాల శివ కెరీర్ పై చాలా ప్ర‌భావం చూపించింది. మంచి క్రేజ్ ఉన్న క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ గా ఇన్ని సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న సంపాదించుకున్న పేరును ఒక్క దెబ్బ‌తో పాతాళానికి ప‌డిపోయేలా చేసింది. అయితే చిరంజీవి అభిమానులు మాత్రం ఇప్ప‌టికీ ఆయ‌న‌పై ఇంకా ఆగ్ర‌హంగానే ఉన్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న‌ను సోష‌ల్ మీడియాలో ఏకి పారేస్తూనే ఉన్నారు. తాజాగా చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీ విడుద‌లైన త‌రువాత కూడా చిరు అభిమానులు కొర‌టాల శివను వ‌ద‌ల‌డం లేదు.

ఇక గాడ్ ఫాద‌ర్ రిలీజ్ అయిన మొద‌టి రోజునుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. దీంతో మెగా అభిమానులు ప‌ట్ట‌రాని సంతోషంలో ఉన్నారు. సోషల్ మీడియాలో బాస్ ఈజ్ బ్యాక్ అని ట్రెండ్ చేయ‌డం స్టార్ట్ చేసేసారు. ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌రువాత వ‌చ్చిన గాడ్ ఫాద‌ర్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుండ‌టంతో అభిమానులు ఆనందంలో తేలియాడుతున్నారు.

Chiranjeevi fans troll Koratala Siva for Godfather positive talk
Koratala Siva

ఈ క్ర‌మంలో కొంద‌రు మ‌ళ్లీ కొర‌టాల శివను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. మోహ‌న్ రాజా చిన్న ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికీ అభిమానులు ఏం కోరుకుంటున్నారో చిరంజీవిని అలాగే చూపించాడ‌ని కామెంట్ చేస్తున్నారు. ఆచార్య పేరుతో నువ్వు తీసింది సినిమా కాదు చెత్త అని కొర‌టాలను విమ‌ర్శిస్తున్నారు. మోహ‌న్ రాజాను చూసి అయినా నువ్వు నేర్చుకోవాల‌ని కొర‌టాల శివను ఉద్దేశించి కొంద‌రు అభిమానులు ట్వీట్ చేశారు.

అయితే ఇప్పుడు కొర‌టాల కూడా ఒక మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో త‌న స‌త్తా ఏంటో చూపించాల‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. చిరంజీవి ఏ విధంగా అయితే గాడ్ ఫాద‌ర్ తో తిరిగి వ‌చ్చాడో కొర‌టాల కూడా అదే విధంగా ఎన్టీఆర్ తో త‌ను తీయ‌బోయే త‌దుప‌రి సినిమాతో బాక్సాఫీస్ బ‌ద్ద‌ల‌య్యే సినిమా తీసి త‌న‌ను తాను నిరూపించుకోవాల‌ని కొంద‌రు ఆశిస్తున్నారు. దానిపైనే అత‌ని భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రి కొర‌టాల ఏం చేస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now