Chiranjeevi : షూటింగ్‌కు రివాల్వర్ తో వచ్చిన చిరంజీవి.. ఎందుకో తెలుసా?

October 20, 2021 9:44 PM

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో విలక్షణ నటుడిగా నటించిన చిరంజీవి ఆ తర్వాత హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చిరంజీవి గతంలో నటించిన ఓ సినిమా షూటింగ్ కోసం తన నిజమైన రివాల్వర్ ను తీసుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Chiranjeevi came to film shooting with real gun

చిరంజీవి హీరోగా చంటబ్బాయి అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో నటించిన చిరంజీవి ఒక ప్రత్యేక పాటలో గన్ అవసరం ఏర్పడింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు డూప్లికేట్‌ గన్ వాడుతారు. కానీ చిరంజీవి అప్పుడప్పుడే లైసెన్స్ రివాల్వర్ అప్లై చేయగా ఆయనకి లైసెన్స్ రావడంతో సినిమాలో రియాల్టీగా కనిపించడం కోసం సినిమా సెట్లోకి గన్ తో అడుగుపెట్టారు.

అయితే చిరంజీవి రియల్ గన్ తో నటించడానికి దర్శకుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. దీంతో చిరంజీవి చేతిలో రియల్ గన్ ఉండడంతో షూటింగ్ సమయంలో కాస్త జాగ్రత్తగా షూటింగ్ చేశారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎప్పుడు కూడా తన రియల్ గన్ ను షూటింగ్‌లకు తీసుకురాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now