Chiranjeevi Britney Spears : చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌లో హాలీవుడ్ పాప్ సింగ‌ర్‌ బ్రిట్నీ స్పియ‌ర్స్ స్పెష‌ల్ సాంగ్‌..?

October 13, 2021 9:09 AM

Chiranjeevi Britney Spears : మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాద‌ర్ పేరిట తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్ లా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కు భిన్నంగా మెగాస్టార్ ఈ మూవీలో క‌నిపించ‌నుండ‌డంతో ఈ మూవీపై అంద‌రిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Chiranjeevi Britney Spears to appear in special song in god father movie

అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. హాలీవుడ్ పాప్ సింగ‌ర్ బ్రిట్నీ స్పియ‌ర్స్‌ను గాడ్ ఫాద‌ర్ మూవీలో ఓ ప్ర‌త్యేక సాంగ్‌లో న‌టింప‌జేయాల‌ని చిత్ర బృందం చూస్తున్న‌ద‌ట‌. అందులో భాగంగానే బ్రిట్నీ స్పియ‌ర్స్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె అందులో ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తుండ‌గా.. ఇందులో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్ కూడా ఓ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని తెలిసింది. అయితే బ్రిట్నీ స్పియ‌ర్స్ స్పెష‌ల్ సాంగ్‌కు చెందిన స‌మాచారాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ఏదేమైనా ఓ హాలీవుడ్ పాప్ సింగ‌ర్‌ను టాలీవుడ్‌లో స్పెష‌ల్ సాంగ్‌కు తీసుకుంటున్నారంటే.. టాలీవుడ్ స్థాయి ఒక మెట్టు పైకి ఎదిగింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now