Chiranjeevi : కట్టుతో క‌నిపించిన మెగాస్టార్ చిరంజీవి.. అస‌లేం జ‌రిగిందో చెప్పేశారు..!

October 18, 2021 8:22 AM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఆయ‌న అభిమానులు ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న అనారోగ్యంతో ఉన్నార‌ని తెలిస్తేనే విల‌విల‌లాడిపోతారు. అలాంటిది రీసెంట్‌గా చిరు చేతికి పెద్ద క‌ట్టుతో క‌నిపించారు. దీంతో అభిమానులు కంగారు ప‌డ్డారు. ఆందోళ‌న చెందారు. ఏం జ‌రిగిందా ? అంటూ ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి త‌న చేతి గాయంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

Chiranjeevi appeared with bandage told about what really happened

చిరంజీవి త‌న చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ..కుడి చేతితో ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యులను సంప్రదించాను. కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్‌ నర్వ్‌పై ఒత్తిడి పడటమే నొప్పికి కారణమని వైద్యులు తేల్చారు.. దీనిని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారని.. వారు పేర్కొన్నారు.

అపోలోలో నా చేతికి స‌ర్జ‌రీ జ‌రిగింది. నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సర్జరీలో మీడియన్‌ నర్వ్‌ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సరిచేసి ఒత్తిడిని తగ్గించారు. పదిహేను రోజుల్లో కుడి చేయి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అభిమానులెవరూ కంగారు పడాల్సిన పనిలేదు.. అని చిరంజీవి స్ప‌ష్టం చేశారు. స‌ర్జ‌రీ వ‌ల్ల గాడ్ ఫాద‌ర్ షూటింగ్‌లో పాల్గొన‌లేక‌బోతున్న చిరంజీవి న‌వంబ‌ర్ 1 నుండి మ‌ళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నారు. 66 ఏళ్ల వ‌య‌స్సులోనూ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now