Chiranjeevi : చిరంజీవితో క‌ల‌సి న‌టించనున్న ర‌వితేజ‌.. క్రేజీ కాంబో రిపీట్ అయితే బొమ్మ హిట్టే..?

November 11, 2021 9:39 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా వ‌స్తుందంటే చాలు.. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంటారు. ఇక న‌టీన‌టులు అయితే ఆయ‌న ప‌క్క‌న న‌టించే చాన్స్ వ‌స్తే బాగుండును.. అని క‌ల‌లు కంటుంటారు. అయితే సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు చిరంజీవిని అన్న‌య్య‌గా భావిస్తారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు హీరోలు ఆయ‌న ప‌క్క‌న త‌మ్ముళ్లుగా న‌టించి మెప్పించారు. వారిలో ర‌వితేజ ఒక‌రు.

Chiranjeevi and raviteja may act once more in a movie

గ‌తంలో ర‌వితేజ చిరంజీవి ప‌క్క‌న అన్న‌య్య సినిమాలో ఆయ‌న త‌మ్ముడిగా న‌టించారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవుతుంద‌ని అంటున్నారు. కాక‌పోతే ఇప్పుడు ర‌వితేజ కూడా హీరోగా పాపుల‌ర్ అయ్యాడు. దీంతో ఆయ‌న చిరంజీవితో క‌లిసి న‌టిస్తే బొమ్మ దద్ద‌రిల్లి పోతుంద‌ని భావిస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ మూవీలో చిరంజీవి ప‌క్క‌న త‌మ్ముడిగా ర‌వితేజ న‌టిస్తార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ విషయ‌మై ద‌ర్శ‌కుడు బాబీ ఇప్ప‌టికే ర‌వితేజ‌ను సంప్ర‌దించార‌ట‌. అందుకు ర‌వితేజ కూడా ఓకే చెప్పార‌ట‌. దీంతో ఈ విష‌యాన్ని త్వ‌ర‌లో చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి, ర‌వితేజ ఇద్ద‌రికీ మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెగ ఉంది. ఈ నేప‌థ్యంలో వీరు తెర‌పై క‌ల‌సి క‌నిపిస్తే.. సినిమా బంప‌ర్ హిట్ అవ‌డం గ్యారంటీ అని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now