Chiranjeevi : చిరంజీవి సినిమా ఫంక్ష‌న్‌లో పూరీ.. ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మూవీ వ‌చ్చేనా..?

November 6, 2021 11:45 PM

Chiranjeevi : పూరీ జ‌గ‌న్నాథ్‌కు డైన‌మిక్ డైరెక్ట‌ర్‌గా ఎంతో పేరుంది. మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇచ్చే డైలాగ్‌ల‌ను సినిమాల్లో పెడుతుంటారు. ఆయ‌న తీసిన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు ఉన్న‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్‌గా పూరీకి ప్రేక్ష‌కుల్లో మంచి పేరే ఉంది. అయితే ఆయ‌న చిరంజీవితో సినిమా చేయ‌లేదు. వారిద్ద‌రి మ‌ధ్య ఏమైందో కూడా చాలా మందికి తెలియ‌దు. కానీ తాజాగా చిరు 154 మూవీకి ఆయ‌న అతిథిగా హాజ‌ర‌వ‌డం చూస్తుంటే.. పాత గొడ‌వ‌లు, మ‌న‌స్ఫ‌ర్థ‌లు అన్నీ మ‌రిచిపోయార‌ని.. పూరీ మెగా కాంపౌండ్‌కు ద‌గ్గ‌ర‌య్యార‌ని అనిపిస్తోంది.

Chiranjeevi and puri jagannadh can we expect a movie from these combination

చిరంజీవి 154వ చిత్రాన్ని అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభించారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, రాఘ‌వేంద్ర రావు, వినాయ‌క్ వంటి వారు హాజ‌రై చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే పూరీ స‌డెన్‌గా చిరంజీవి ప్రోగ్రామ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైనందుకు చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో చిరంజీవితో ఆటో జానీ సినిమాను పూరీ ప్లాన్ చేశాడు. మొద‌టి పార్ట్ నెరేష‌న్ బాగానే వ‌చ్చింద‌న్నారు. కానీ ఏమైందో తెలియ‌దు, ఆ ప్రాజెక్ట్ అట‌కెక్కేసింది. త‌రువాత దాని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

అయితే చిత్రంలో సెకండాఫ్ బాగా లేద‌ని చిరంజీవి బ‌య‌టి వ్య‌క్తుల‌తో అన్నార‌ట‌. అదేదో త‌న‌కే చెబితే ఇంకో వెర్ష‌న్ రాసి ఇచ్చే వాణ్ని క‌దా.. అని పూరీ విచారించాడ‌ట‌. దీంతో ఆటో జానీ కాస్తా మ‌ధ్యలోనే ఆగిపోయింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

కానీ గ‌తం గ‌తః. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. పూరీ స‌డెన్‌గా చిరు మూవీకి గెస్ట్‌లా వ‌చ్చారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఇద్ద‌రూ క‌ల‌సి భ‌విష్య‌త్తులో ఏదైనా సినిమా చేస్తారేమోన‌ని ఫ్యాన్స్ ఆశ‌ప‌డుతున్నారు. మ‌రి వీరి క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుందో, రాదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now