Chiranjeevi : ఆందోళ‌న చెందుతున్న చిరంజీవి, మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌.. ఎందుకు..?

February 7, 2022 2:07 PM

Chiranjeevi : మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ పేరు ఒక్క‌సారిగా మారుమోగిపోయింది. ఆమెకు ఆ మూవీకి అవార్డు కూడా ల‌భించింది. అయితే త‌రువాత ఆమె చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అన్నీ వ‌రుస‌గా ఫ్లాప్స్ అయ్యాయి. ఇటీవ‌లే ఆమె న‌టించిన గుడ్ ల‌క్ స‌ఖి అనే మూవీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమెను ఐర‌న్ లెగ్ అని చెప్పి కొంద‌రు అంటున్నారు.

Chiranjeevi and mahesh babu fans worrying too much know the reason
Chiranjeevi

అయితే కీర్తి సురేష్ ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాల్లో న‌టిస్తోంది. ఒక‌టి మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట కాగా.. రెండోది చిరంజీవి భోళా శంక‌ర్‌. మ‌హేష్ ప‌క్క‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. చిరంజీవి సినిమాలో ఆయ‌న చెల్లెలిగా ఆమె న‌టిస్తోంది. అయితే ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ వ‌రుస ఫ్లాప్ లు అవుతుండ‌డంతో అటు మ‌హేష్, ఇటు చిరు ఫ్యాన్స్‌.. ఆందోళ‌న చెందుతున్నారు. ఆ మూవీలు కూడా ఫ్లాప్ అవుతాయా.. అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఒక లాజిక్‌ను చిరంజీవి ఫ్యాన్స్ చెబుతున్నారు. అదేమిటంటే.. ర‌జ‌నీకాంత్ అన్నాత్తె సినిమాలో ఆయ‌న చెల్లెలి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది. అయితే ఆ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఇక భోళా శంక‌ర్‌లోనూ ఆమె చిరంజీవి చెల్లెలిగానే న‌టిస్తోంది. దీంతో ఈ సారూప్య‌త‌ను చెబుతూ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

మ‌రోవైపు భోళాశంక‌ర్ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ కూడా చాలా కాలం త‌రువాత సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయ‌న‌కు గ‌తంలోనూ అన్నీ ఫ్లాప్ మూవీలు ఉన్నాయి. దీంతో ఫ్లాప్ హీరోయిన్‌, ఫ్లాప్ ద‌ర్శ‌కుడు.. ఇలా ఇద్ద‌రూ భోళా శంక‌ర్ సినిమాకు ప‌నిచేస్తున్నారు.. క‌నుక ఈ మూవీ ఫ్లాప్ అవుతుందేమోన‌ని ఫ్యాన్స్ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ ఈ సినిమాతో హిట్ కొడ‌తారా.. అన్న అనుమానాల‌ను కూడా రేకెత్తిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన పెరిగిపోతోంది. మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now