Chiranjeevi : మరోసారి అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్..!

October 23, 2021 3:12 PM

Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో సినీ పెద్దగా ఉండడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంటారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే వారికి సహాయం చేయడంలో మెగాస్టార్ ముందుంటారని చెప్పవచ్చు.

Chiranjeevi again helped his fan suffering from cancer

తాజాగా విశాఖ జిల్లాకు చెందిన వెంకట్ అనే ఒక అభిమాని గత కొద్దిరోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు, అఖిల భారతి అధ్యక్షుడు ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ విషయంపై చిరు స్పందించి.. వెంటనే తన అభిమానిని హైదరాబాద్ కు తీసుకురావాలని సూచించారు.

హైదరాబాద్‌లో అతని వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని ఈ సందర్భంగా మెగాస్టార్ తెలియజేశారు. ఇలా మరోసారి అభిమాని పట్ల గొప్ప మనసును చాటుకొని మెగాస్టార్ అంటే ఏంటో నిరూపించుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now