Chaurasia : ప్రైవేట్ పార్ట్‌పై కొట్టి త‌ప్పించుకున్నాను.. అని కామెంట్ చేసిన న‌టి చౌరాసియా..

November 18, 2021 9:28 AM

Chaurasia : గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల‌లో తెగ నానుతున్న పేరు చౌరాసియా. రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. నిందితుడు నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు.

Chaurasia said she escaped from psycho by hitting him

చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ.. భావిస్తున్నారు. దీంతో నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు. అయితే చౌరాసియా తాజా ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. కేబీఆర్‌ పార్కు సీవీఆర్‌ గేట్‌ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. మెయిన్‌ గేట్‌ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు.

డ‌బ్బులు ఇస్తాన‌ని అన‌డంతో ఒక చేయి వదిలేశాడ‌ని, 100కి ఫోన్ చేస్తున్నాన‌ని తెలుసుకొని నా ఫోన్ లాక్కున్నాడ‌ని పేర్కొంది. ఇక హెల్ప్‌ అంటూ అరుస్తుండగా అదే పనిగా చేతులు, ముఖంపై దాడి చేశాడని వివరించింది.

బండరాయితో తన ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా తన మోచేతితో ప్రైవేట్‌ పార్ట్‌పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు చేరుకున్నానని తెలిపారు. హెల్ప్ అని గ‌ట్టిగా అర‌వ‌డంతో కాఫీ షాపులో వారు వ‌చ్చార‌ని తెలియ‌జేసింది. తన చేతికి ఉన్న డైమండ్‌ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment