Charmi Kaur Puri Jagannadh : ఛార్మి.. పూరీ జ‌గ‌న్నాథ్‌.. స్నేహితులు అయింది అలా..!

April 18, 2022 8:40 AM

Charmi Kaur Puri Jagannadh : టాలీవుడ్ లో కేవ‌లం గ్లామ‌ర్ షో తోనే హీరోయిన్స్ గా చెలామ‌ణీ అవుతున్న ఈ త‌రుణంలో తన‌ అందంతో, అభియ‌నంతో విభిన్న ర‌కాల చిత్రాల‌ను చేస్తూ టాలీవుడ్ లో ఒక‌ప్పుడు అగ్ర స్థానంలో నిలిచిన హీరోయిన్స్ ల‌లో ఛార్మి ఒక‌రు. 2002 లో నీ తోడు కావాలి అనే సినిమాతో ఛార్మి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యింది. అతి త‌క్కువ స‌మయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో ఛార్మి న‌టించింది. కేవ‌లం హీరోయిన్ గా మాత్ర‌మే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లోనూ విభిన్న ర‌కాల పాత్ర‌ల‌ను పోషించి త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Charmi Kaur Puri Jagannadh this is how their friendship started
Charmi Kaur Puri Jagannadh

2015 లో వ‌చ్చిన జ్యోతిల‌క్ష్మి సినిమాతో త‌న హీరోయిన్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. త‌రువాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌నాథ్ తో క‌లిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ఛార్మి. వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ నిర్మాణ రంగంలో దూసుకు పోతున్న ఛార్మి గురించి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అప్ప‌ట్లో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ తో ఛార్మి ప్రేమాయ‌ణం వార్త పెద్ద సంచ‌ల‌న‌మే సృషించిద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీరిద్ద‌రూ క‌లిసి ప‌బ్ ల‌కు, ప్రైవేట్ పార్టీల‌కు వెళ్లే వార‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌నే వార్తలు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వ‌చ్చాయి.

కానీ కొన్ని రోజులు ల‌వ్ త‌రువాత వీరిద్ద‌రి మధ్య వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోయార‌ని స‌మాచారం. దీంతో ఛార్మి చాలా డిప్రెష‌న్ లోకి వెళ్ళింద‌ట‌. ఈ ఇద్ద‌రూ గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుందామ‌నుకున్నారు. కానీ ఎందుకు విడిపోయారో తెలియ‌దు. అయితే సినీ రంగానికే చెందిన ఓ వ్య‌క్తి కార‌ణంగానే వారు విడిపోయిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ స‌మ‌యంలోనే పూరీ జ‌గ‌న్నాథ్ జ్యోతిల‌క్ష్మి సినిమాతో ఛార్మికి ఒక మంచి స్నేహితుడిలా ద‌గ్గ‌ర‌వ‌డం, డిప్రెష‌న్ లో ఉన్న ఛార్మిని కెరీర్ ప‌రంగా దృష్టి సారించేలా చేయ‌డం, నిర్మాణ రంగం వైపు అడుగులు వేసేలా చేయ‌డం.. వంటివి చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి. వీరిద్ద‌రూ క‌లిసి నిర్మించిన సినిమాల‌లో ఇస్మార్ట్ శంక‌ర్ త‌ప్ప మిగిలిన సినిమాలు పెద్ద‌గా విజ‌యాల‌ను సాధించ లేదు. దీంతో ఆర్థికంగా ఛార్మి, పూరీ జ‌గ‌న్నాథ్ ఇద్ద‌రూ దెబ్బ తిన్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ సాధించిన విజ‌యంతో వీరిద్ద‌రూ లాభాల బాట ప‌ట్టార‌ని స‌మాచారం. ప్రస్తుతం వీరిద్ద‌రూ క‌లిసి విజ‌య్ దేవ‌ర కొండ‌తో లైగ‌ర్ అనే సినిమాను తీస్తున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌ల్లో కూడా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌రీ ఈ సినిమా ఆ అంచ‌నాల‌ను అందుకుంటుందో.. లేదో.. చూడాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment