RRR : ఆర్ఆర్ఆర్ విష‌యంలో ప‌వ‌న్‌ని క‌న్విన్స్ చేసే బాధ్య‌తను చంద్ర‌బాబు తీసుకోబోతున్నారా..!

November 25, 2021 9:19 AM

RRR : పాన్ ఇండియా మూవీగా దాదాపుగా రూ.450 కోట్ల ఖర్చుతో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి పోటీగా భీమ్లా నాయ‌క్, రాధే శ్యామ్ చిత్రాలు బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వం పెద్ద బాంబ్ పేల్చింది. టికెట్స్ రేట్స్, బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ విషయ లో కీలక నిర్ణయం తీసుకుంది. బెన్ ఫిట్స్ షోస్, ఎక్స్ ట్రా షోస్ ఇ పై ఉండవు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

chandrababu may convince pawan kalyan to step down for rrr

ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌లో టెన్షన్‌ నెలకొంది. ఇప్పటికే థియేటర్లలో తగ్గించిన టిక్కెట్ ధరలను అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. దీంతో టిక్కెట్స్ ద్వారా వ‌చ్చే ఆదాయంలో రూ.25 కోట్ల న‌ష్టం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపునకు వ్యతిరేకంగా డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయిస్తారని వార్తలు రాగా, ఇది ముందుగానే గ్రహించిన ప్ర‌భుత్వం అత్యవసర ప్రకటనలు జారీ చేసింది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం ముందు ఉన్న ఏకైక ఆప్ష‌న్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాని పోస్ట్ పోన్ చేయించ‌డ‌మే. భీమ్లా నాయక్ విడుదలను కొన్ని రోజులు ఆలస్యం చేయమని పవన్ కళ్యాణ్‌ను ఒప్పించడానికి చంద్ర‌బాబు మ‌ధ్య‌వ‌ర్తిత్వం తీసుకోబోతున్నార‌ట‌. రాజమౌళికి చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అమరావతి రాజధాని నగరానికి కొన్ని డిజైన్లు అందించి నాయుడుకి సహాయం చేశాడు.

ఇప్పుడు భీమ్లా నాయ‌క్ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకుగాను పవన్ కళ్యాణ్‌ను ఒప్పించడానికి రాజమౌళి అండ్ టీంకి ఉన్న ఏకైక ఆప్ష‌న్ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. రాజమౌళి రిక్వెస్ట్ చేస్తే నాయుడు నో అనరు. మరియు నాయుడు అభ్యర్థన చేస్తే, పవన్ కళ్యాణ్ కూడా నో చెప్పడు, అని స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. చూడాలి మ‌రి, ఏం జ‌రుగుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now