Carrot Oil : చ‌ర్మంపై ఎలాంటి దుర‌ద‌లు ఉన్నా.. జెట్ వేగంతో త‌గ్గిస్తుంది.. ఎంతో ఉప‌యోగ‌క‌రం..

October 4, 2022 2:53 PM

Carrot Oil : ప్రస్తుత ఆధునిక కాలంలో వాతావరణంలో  పెరుగుతున్న పొల్యూషన్ వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు, అలాగే చర్మ సమస్యలతో యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చర్మ సమస్యలను తగ్గించడం కోసం ముందుగా హోం రెమిడీస్ ఉపయోగించి.. ఆతర్వాత వైద్యులను సంప్రదిస్తుంటారు. అయినా కూడా కొంత మందికి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ముఖంపై ఏర్పడే మొటిమలు, చర్మంపై ఏర్పడే రాషెస్ వంటి సమస్యలను తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ ఎంతో సహాయపడుతుంది. స్వచ్చమైన నూనెలలో క్యారెట్ ఆయిల్ కూడా ఒకటి. క్యారెట్ ఆయిల్ తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. క్యారెట్ ఆయిల్ లో ఎక్కువగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా చర్మంపై ఉండే చెడు బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. ఈ నూనె వలన చర్మానికి ఎలాంటి హాని ఉండదు.

Carrot Oil is very useful in reducing rashes
Carrot Oil

అదేవిధంగా మానసిక స్థితిని మెరుగుపరచడానికి  క్యారెట్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా ఆరోమాథెరపీలో  ఉపయోగిస్తారు. ఆరోమాథెరపీలో ఉపయోగించడం వలన ఆందోళన, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మం మంట సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ నూనె శోథ నిరోధ‌క లక్షణాలను తొలగించడమే కాకుండా మొటిమలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు మన చర్మసౌందర్యానికి క్యారెట్ ఆయిల్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. క్యారెట్ ఆయిల్ 5 నుంచి 10 చుక్కల వరకు 5 టేబుల్ స్పూన్ల వేడినీటిలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసి పేస్టులా రెడీ చేసుకోవాలి. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. మొటిమల వల్ల కలిగే దురద, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now