Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. బిగ్ బాస్ ఓటీటీ షోలో పాల్గొని బయటకు వచ్చిన తరువాత ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు అవసరం లేకపోయినా.. అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తోంది. రోజుకో విచిత్రమైన డ్రెస్‌ను ధరిస్తుంటుంది. దీంతో ఆమె వెనుకే కెమెరామెన్లు ఫాలో అవుతూ ఆమెను ఫొటోలు తీస్తుంటారు. ఆమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా కొన్ని ఫన్నీ సంఘటనలు జరిగాయి.
ఉర్ఫి జావేద్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెను ఫొటో తీసేందుకు రోజూ కెమెరామెన్లు వెంటపడుతుంటారు. ఆమె ఉండే ఫ్లాట్ దగ్గరే వారు కాపు కాస్తుంటారు. ఆమె ఎప్పుడు ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫొటోలు తీద్దామా.. అని కాచుకుని కూర్చుంటారు. ఇక తాజాగా ఆమె పొడవైన టీషర్టు వేసుకుని కింద ప్యాంట్ ధరించకుండానే బయటకు వచ్చింది. చూస్తుంటే ఆమె సరుకుల కోసం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే కెమెరామెన్లు ఆమెను ఫొటోలు తీసేందుకు వెంటపడ్డారు. తాను ప్యాంట్ వేసుకోలేదని, ఇప్పుడు ఫొటోలు తీయకండని.. ఆమె అంటూ పరుగెత్తింది. అయినప్పటికీ కెమెరామెన్లు వినిపించుకోలేదు. ఆమె వెంట వారు కూడా పరుగెత్తారు. చివరకు ఆమె తన ఫ్లాట్‌లోకి వెళ్లిపోయింది. తాను ప్యాంట్ వేసుకోలేదని చెప్పినా.. కెమెరా మెన్లు వినిపించుకోకుండా.. మీరు ఇలా కూడా బాగానే ఉన్నారు మేడమ్.. అంటూ ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. అయితే ఉర్ఫి జావేద్ వారి నుంచి ఎలాగో తప్పించుకుంది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
ఇక మరో సంఘటనలో ఉర్ఫి జావేద్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని గ్లామర్ షో చేసింది. తన అపార్ట్‌మెంట్ బయట ఉండగా.. పాన్ నములుతున్న ఓ వ్యక్తి వచ్చి సెల్ఫీ కావాలని అడిగాడు. దీంతో ఉర్ఫి అడ్డు చెప్పలేదు. కానీ అతను సెల్ఫీ తీసుకోకుండా ముందుగా పాన్‌ను అక్కడే ఉమ్మేశాడు. తరువాత ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో ఉర్ఫి బిగ్గరగా నవ్వేసింది. ఇక ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…