Urfi Javed : ప్యాంట్ వేసుకోలేదు, వ‌ద్ద‌ని చెప్పిన ఉర్ఫి జావేద్‌.. అయినా ఫొటోల కోసం ఎగబ‌డ్డ కెమెరామెన్లు..

February 2, 2022 12:34 PM

Urfi Javed : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. బిగ్ బాస్ ఓటీటీ షోలో పాల్గొని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. అస‌లు అవ‌సరం లేక‌పోయినా.. అందాల‌ను ఆర‌బోస్తూ హీటెక్కిస్తోంది. రోజుకో విచిత్ర‌మైన డ్రెస్‌ను ధ‌రిస్తుంటుంది. దీంతో ఆమె వెనుకే కెమెరామెన్లు ఫాలో అవుతూ ఆమెను ఫొటోలు తీస్తుంటారు. ఆమె ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. అయితే తాజాగా కొన్ని ఫ‌న్నీ సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి.

cameramen followed Urfi Javed for photos she escapes
Urfi Javed

ఉర్ఫి జావేద్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెను ఫొటో తీసేందుకు రోజూ కెమెరామెన్లు వెంట‌ప‌డుతుంటారు. ఆమె ఉండే ఫ్లాట్ ద‌గ్గ‌రే వారు కాపు కాస్తుంటారు. ఆమె ఎప్పుడు ఎలాంటి డ్రెస్‌లో క‌నిపిస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫొటోలు తీద్దామా.. అని కాచుకుని కూర్చుంటారు. ఇక తాజాగా ఆమె పొడ‌వైన టీష‌ర్టు వేసుకుని కింద ప్యాంట్ ధ‌రించ‌కుండానే బ‌య‌ట‌కు వ‌చ్చింది. చూస్తుంటే ఆమె స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by video editor (@thelallantopmemes18)

అయితే కెమెరామెన్లు ఆమెను ఫొటోలు తీసేందుకు వెంట‌ప‌డ్డారు. తాను ప్యాంట్ వేసుకోలేద‌ని, ఇప్పుడు ఫొటోలు తీయ‌కండ‌ని.. ఆమె అంటూ ప‌రుగెత్తింది. అయిన‌ప్ప‌టికీ కెమెరామెన్లు వినిపించుకోలేదు. ఆమె వెంట వారు కూడా ప‌రుగెత్తారు. చివ‌ర‌కు ఆమె త‌న ఫ్లాట్‌లోకి వెళ్లిపోయింది. తాను ప్యాంట్ వేసుకోలేద‌ని చెప్పినా.. కెమెరా మెన్లు వినిపించుకోకుండా.. మీరు ఇలా కూడా బాగానే ఉన్నారు మేడ‌మ్‌.. అంటూ ఫొటోలు తీసేందుకు ఎగ‌బ‌డ్డారు. అయితే ఉర్ఫి జావేద్ వారి నుంచి ఎలాగో త‌ప్పించుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఇక మ‌రో సంఘ‌ట‌న‌లో ఉర్ఫి జావేద్ పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని గ్లామ‌ర్ షో చేసింది. త‌న అపార్ట్‌మెంట్ బ‌య‌ట ఉండ‌గా.. పాన్ న‌ములుతున్న ఓ వ్య‌క్తి వ‌చ్చి సెల్ఫీ కావాల‌ని అడిగాడు. దీంతో ఉర్ఫి అడ్డు చెప్ప‌లేదు. కానీ అత‌ను సెల్ఫీ తీసుకోకుండా ముందుగా పాన్‌ను అక్క‌డే ఉమ్మేశాడు. త‌రువాత ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. దీంతో ఉర్ఫి బిగ్గ‌ర‌గా న‌వ్వేసింది. ఇక ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now