Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన కామెడీ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బ్రహ్మానందం.. నటుడు కృష్ణంరాజు దంపతులను కలిశారు. గత కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్య కారణంగా శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బ్రహ్మానందం తను స్వయంగా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని కృష్ణంరాజు దంపతులకు బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాకుండా.. మంచి కళాకారుడు కూడా అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అదేవిధంగా బ్రహ్మానందం కృష్ణంరాజు దంపతులకు మంచి బహుమతిని అందించినందుకు బ్రహ్మానందంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో బ్రహ్మానందం స్వయంగా తాను గీసిన చిత్రాలను అల్లు అర్జున్, రానాకి కూడా ప్రత్యేకంగా పంపించారు. ఇక బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రంగమార్తాండ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…