Brahmanandam : బ్రహ్మానందం ఎప్పుడో చేసిన దాన్ని సమంత కాపీ కొట్టిందా..? బ్రహ్మి ఏమన్నారు..?

December 25, 2021 1:59 PM

Brahmanandam : టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత తొలిసారి పుష్ప కోసం ఐటమ్‌ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సాంగ్‌కి ప్ర‌శంస‌ల‌తోపాటు విమ‌ర్శ‌లు కూడా ద‌క్కాయి. అయితే ఏది ఏమైనా ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ పాటతోపాటు ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ సాంగ్‌ని, సమంతని ట్రోల్స్ చేయడం విశేషం.

Brahmanandam response over samantha copied his style meme

అంతేకాదు ఇందులోని సమంత పోజులకు మీమ్స్ చేసి వైరల్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ మీమ్ ఇప్పుడు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతేకాదు వైరల్‌ అవుతోంది. ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. అనే సాంగ్‌లో సమంత స్టిల్‌ ఒకటి ఆ మధ్య బాగా వైరల్‌ అయింది. మీమ్స్‌లో బీభత్సంగా వాడే బ్రహ్మానందం స్టిల్‌ ఒకటి కూడా అచ్చం అలాగే ఉంటుంది. దీంతో మీమ్స్‌రాయుళ్లు ‘మా బ్రహ్మానందం స్టైల్‌ను కాపీ చేయకండి సామ్‌.. అంటూ మీమ్స్ వ‌దిలారు.

ఇదే మీమ్ బ్ర‌హ్మానందంకి ఓ కార్య‌క్ర‌మంలో తగిలింది. దీనిపై త‌న దైన శైలిలో స్పందించారు. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సదరు మీమ్‌ను చూసి.. ‘నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను. దానికి బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం’ అని కౌంటరిచ్చారు. ప్ర‌స్తుతం సామ్, బ్ర‌హ్మీ మీమ్ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment