Bithiri Sathi : ఆ చాన‌ల్‌కు కూడా గుడ్ బై చెప్పిన బిత్తిరి స‌త్తి.. ఇంక ఆయ‌న చేయ‌బోతుంది అదే..?

April 16, 2022 8:38 PM

Bithiri Sathi : బిత్తిరి స‌త్తి.. అలియాస్ చేవెళ్ల ర‌వి.. ఈయ‌న పేరు చెబితేనే చాలు.. మ‌న పెద‌వుల‌పై చిరున‌వ్వు వ‌స్తుంది. వెండితెర‌పై బ్ర‌హ్మానందం కామెడీ చేస్తూ ఎంత‌టి పేరు తెచ్చుకున్నారో.. బుల్లితెర‌పై బిత్తిరి స‌త్తికి కూడా అంతే పేరు వ‌చ్చింది. త‌న‌దైన శైలిలో భాష‌ను మాట్లాడ‌డం ఒక్క ఈయ‌నకే చెల్లింది. శుభాకాంక్ష‌లకు బ‌దులుగా శుభా క‌లెక్ష‌న్లు అన్నా.. రామ్ చ‌ర‌ణ్ కు బ‌దులుగా చ‌ర‌ణాలు సార్‌.. అన్నా.. అది స‌త్తికే చెల్లింది. ఇలా స‌త్తి భాష‌ను ఈయ‌న క‌నిపెట్టారు. ఈ క్ర‌మంలోనే త‌క్కువ కాలంలోనే ఈయ‌న ఎంతో పాపుల‌ర్ అయ్యారు. స‌త్తి మొద‌ట్లో వీ6 న్యూస్ చాన‌ల్‌లో తీన్మార్ వార్త‌ల‌లో క‌నిపించారు. ఆ వార్త‌ల ద్వారానే ఆయ‌న‌కు బాగా పేరు వ‌చ్చింది. అయితే అనూహ్యంగా ఆయ‌న వీ6 నుంచి త‌ప్పుకుని ప‌లు ఇత‌ర చాన‌ల్స్‌లో జాయిన్ అయ్యారు.

Bithiri Sathi again left a channel what he will do next
Bithiri Sathi

వీ6 చాన‌ల్ త‌రువాత స‌త్తి టీవీ9లో చేరారు. అక్క‌డ ఇస్మార్ట్ వార్త‌లు అనే ప్రోగ్రామ్ చేశారు. వీ6లో సావిత్రిగా అల‌రించిన శివ‌జ్యోతి కూడా ఆ చాన‌ల్‌కు గుడ్‌బై చెప్పి టీవీ9లో చేరారు. అక్క‌డ ఈ ఇద్ద‌రూ మ‌ళ్లీ కార్య‌క్ర‌మంలో చేశారు. అయితే స‌త్తి అక్క‌డి నుంచి కూడా జంప్ అయి సాక్షిలో చేరారు. అక్క‌డ సుదీర్ఘ కాలం నుంచి ప‌నిచేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయ‌న సాక్షి నుంచి కూడా త‌ప్పుకున్నారు. ఆయ‌న అందులో చేస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు మొద‌ట్లో రేటింగ్స్ బాగానే వ‌చ్చాయి. కానీ రాను రాను వీక్ష‌కులు ఆ కార్య‌క్ర‌మాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో రేటింగ్స్ ప‌డిపోయాయి. ఇక ఆ కార‌ణ‌మో.. మరొక‌టో తెలియ‌దు కానీ.. స‌త్తి సాక్షి చాన‌ల్‌కు కూడా గుడ్ బై చెప్పారు.

అయితే సాక్షి చాన‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. స‌త్తి వేరే ఏ ఆఫ‌ర్‌ను కూడా ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఎందుకంటే ఆయ‌న ఇవ‌న్నీ వ‌దిలేసి ఇక‌పై కేవ‌లం సినిమాల్లోనే న‌టించాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఈవెంట్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షోల‌లో క‌నిపించాల‌ని అనుకుంటున్నార‌ట‌. క‌నుక ఇత‌ర చానల్స్ నుంచి వ‌చ్చే ఆఫ‌ర్ల‌ను వ‌ద్ద‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక స‌త్తి త్వ‌ర‌లోనే చిరంజీవి సినిమాలో న‌టించ‌నున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment