నందమూరి కల్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ.. బింబిసార. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కల్యాణ్ రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయన సరసన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ ఎలా ఉంది ? కథ ఏమిటి ? ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
ఈ కథ మొత్తం క్రీస్తుశకం 5వ శతాబ్దంలో జరిగినట్లు చెప్పబడింది. అలాగే ప్రస్తుతం కాలంలోనూ కొంత కథ నడుస్తుంది. ఇక బింబిసారుడు (కల్యాణ్ రామ్) త్రిగర్తలకు రాజు. అత్యంత క్రూరుడిగా, దయలేని రాజుగా పాలిస్తుంటాడు. అతనికి కవల సోదరుడు ఉంటాడు. పేరు దేవదత్తుడు. ఇతను చాలా జాలి, దయ గుణాలు కలిగిన వాడు. అయితే ఇద్దరు సోదరుల మధ్య కలహాలు వస్తాయి. ఈ క్రమంలోనే కథ ప్రస్తుత కాలానికి మారుతుంది. అయితే వారి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి ? ఈ కాలంలో బింబిసారుడు ఎలా అడ్జస్ట్ అవుతాడు ? చివరకు ఏమవుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
బింబిసార మూవీ నిజంగా కల్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఈయన బాడీ లాంగ్వేజ్, భారీ డైలాగ్స్ అదిరిపోయాయి. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా సరే కల్యాణ్ రామ్ జీవించగలడు. అలాగే ఈ మూవీలోనూ అదిరిపోయేలా యాక్టింగ్ చేశాడు. ఇక ఆయన పక్కన నటించిన క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లు కూడా డీసెంట్‌గానే నటించారు. తమ పాత్రల పరిధుల మేరకు ఆకట్టుకున్నారు.
ఈ మూవీలో తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌లు కూడా యాక్ట్ చేశారు. వీరు కూడా ఫర్వాలేదనిపించారు. ఇక దర్శకుడు వశిష్టకు ఇది తొలి మూవీ. ఈ మూవీ ద్వారానే ఆయన టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అద్భుతమైన కథను ఎంచుకోవడంలో ఈయన సక్సెస్ సాధించరనే చెప్పవచ్చు. అయితే ప్రముఖ నటీనటులను తీసుకున్నా.. వారి పాత్రలను సాధారణం చేశారు. ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేశారు. అందువల్ల సాధారణ నటీనటులు కూడా ఆ పాత్రలకు సరిపోతారని చెప్పవచ్చు. అయినప్పటికీ కథలో కొత్తదనం కనిపిస్తుంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందువల్ల సినిమా ఆద్యంతం ఆసక్తిగానే సాగుతుంది.
ఇక ఎంఎం కీరవాణి అందించిన సంగీతం బాగుంది. సంగీతంలో ఆయనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్‌ఆర్ వంటి చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా ఉంటుంది కనుక కీరవాణి మ్యూజిక్ కు న్యాయం చేశారు. అలాగే ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి.
చివరగా చెప్పాలంటే.. సినిమాలోని కథ, అందులోని కొత్తదనం, స్క్రీన్ ప్లే, కల్యాణ్ రామ్ యాక్టింగ్.. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అలాగే విలన్ బలహీనంగా ఉండడం, ప్యాచ్ లుగా అనిపించడం, ఇతర పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం.. వంటివి మైనస్ అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీని ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తారు. కొత్తదనం కోరుకునేవారితోపాటు ప్రేక్షకులు అందరూ ఈ మూవీని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…