Bigg Boss Telugu 6 : బుల్లితెరపై అత్యంత ఫేమస్ అయిన షోలలో ఒకటి.. బిగ్‌బాస్. అయితే ఇటీవలే బిగ్‌బాస్ ఓటీటీ షో ముగిసింది. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అందులో భాగంగానే లేటెస్ట్‌గా సీజన్ 6 ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇక ఈ షో మరో నెల రోజుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈసారి సామాన్యులకు ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. దీంతో మరోసారి ఔత్సాహికులు అందరూ ఈ షోలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 6లో ఎంత మంది కంటెస్టెంట్లు ఉంటారు ? అనే విషయంపై ప్రస్తుతం నిర్వాహకులు తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే బిగ్‌బాస్ ఓటీటీలో టాప్ 5 స్థానాల్లో వచ్చిన వారిని సీజన్ 6 తీసుకుంటామని గతంలో చెప్పారు. అలా జరిగే ఇంకో 8 మంది కంటెస్టెంట్లను తీసుకుంటే సరిపోతుంది. వారిలో ఒక కంటెస్టెంట్ సామాన్య పబ్లిక్ ఉంటారు. కనుక ఇంకో 7 మంది సెలబ్రిటీలను తీసుకుంటే చాలు. దీంతో ఈ 7 మందిలో ఏయే సెలబ్రిటీలు ఉంటారు.. అనే విషయంపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కొందరు కంటెస్టెంట్ల పేర్లు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. ఇక వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పట్లో స్టార్ యాంకర్‌గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొంటున్నారని తెలిసింది. అలాగే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన గెటప్ శ్రీను, సీరియల్ నటుడు అనుదీప్ చౌదరి, ఆర్‌జే హేమంత్, యాంకర్లు రోజా, ప్రత్యూష, సింగర్ మామ సింగ్ అలియాస్ కృష్ణ చైతన్య, నటుడు కౌశిక్, యూట్యూబర్ నిఖిల్.. తదితరులు ఈసీజన్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…
UCO Bank Recruitment 2026 | యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీఓ బ్యాంక్) 2026 సంవత్సరానికి భారీ నియామక ప్రకటనను…
QR Code On Aadhar | కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలను పొందడంతో పాటు దేశంలోని పౌరులకి ఆధార్ కార్డు అత్యంత…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…