Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌కు రేటింగ్స్ వచ్చాయి. దీంతో ఫినాలే సమయంలోనే హోస్ట్ నాగార్జున కీలక ప్రకటన చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ఈ షోకు నిర్వాహకులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లను ఫైనల్ చేశారని సమాచారం. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కొందరు వివాదాస్పద కంటెస్టెంట్లను కూడా ఈసారి ఓటీటీ షోలో రప్పిస్తున్నారని తెలిసింది. దీంతో బిగ్ బాస్ ఓటీటీ రచ్చ రచ్చగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఇటీవల నాగార్జున ఓ సందర్భంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ 5వ సీజన్ ముగియడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఫినాలేను 5 నుంచి 6 కోట్ల మంది వీక్షించారని తెలిపారు. అయితే తనను ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా చేయాలని స్టార్ మా సంప్రదించిందని అందుకు తాను ఒప్పుకున్నానని తెలిపారు.
ఇక చానల్ ఎయిరింగ్ షో ఈవీపీ, హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ.. టీవీలో వచ్చే బిగ్ బాస్ షో యథా ప్రకారం కొనసాగుతుందని, దాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. కానీ డిజిటల్ వెర్షన్ షో అయిన బిగ్ బాస్ ఓటీటీ భిన్నంగా ఉంటుందని తెలిపారు. దీన్ని మరింత వినూత్నంగా డిజైన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
కాగా తమిళంలోనూ బిగ్ బాస్ ఓటీటీ షోను ఇటీవలే ప్రారంభించారు. దీనికి కమల హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు బిగ్ బాస్ అల్టిమేట్ అని పేరు పెట్టారు. గత సీజన్లలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను ఈ ఓటీటీ షోలోకి రప్పించారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షో లో యాంకర్ శ్రీముఖితోపాటు పలువురు పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ షో ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. దీన్ని రోజుకు 24 గంటలూ 82 రోజుల పాటు లైవ్‌లో ప్రసారం చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…