Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యే తేదీ అదే..!

February 4, 2022 2:15 PM

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సీజ‌న్‌కు రేటింగ్స్ వ‌చ్చాయి. దీంతో ఫినాలే స‌మ‌యంలోనే హోస్ట్‌ నాగార్జున కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీని కూడా త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఈ షోకు నిర్వాహ‌కులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Bigg Boss OTT Telugu may start very soon as per sources
Bigg Boss OTT Telugu

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్ల‌ను ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. గ‌త బిగ్ బాస్ సీజ‌న్ల‌లో పాల్గొన్న కొంద‌రు వివాదాస్ప‌ద కంటెస్టెంట్ల‌ను కూడా ఈసారి ఓటీటీ షోలో ర‌ప్పిస్తున్నార‌ని తెలిసింది. దీంతో బిగ్ బాస్ ఓటీటీ ర‌చ్చ ర‌చ్చ‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

కాగా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల నాగార్జున ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ 5వ సీజ‌న్ ముగియ‌డం త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌న్నారు. ఫినాలేను 5 నుంచి 6 కోట్ల మంది వీక్షించార‌ని తెలిపారు. అయితే త‌న‌ను ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా చేయాల‌ని స్టార్ మా సంప్ర‌దించింద‌ని అందుకు తాను ఒప్పుకున్నాన‌ని తెలిపారు.

ఇక చాన‌ల్ ఎయిరింగ్ షో ఈవీపీ, హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ.. టీవీలో వ‌చ్చే బిగ్ బాస్ షో య‌థా ప్ర‌కారం కొన‌సాగుతుంద‌ని, దాన్ని ఆప‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ డిజిట‌ల్ వెర్ష‌న్ షో అయిన బిగ్ బాస్ ఓటీటీ భిన్నంగా ఉంటుంద‌ని తెలిపారు. దీన్ని మ‌రింత వినూత్నంగా డిజైన్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని తెలిపారు.

కాగా త‌మిళంలోనూ బిగ్ బాస్ ఓటీటీ షోను ఇటీవ‌లే ప్రారంభించారు. దీనికి క‌మ‌ల హాస‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోకు బిగ్ బాస్ అల్టిమేట్ అని పేరు పెట్టారు. గత సీజ‌న్ల‌లో పాల్గొన్న ప‌లువురు కంటెస్టెంట్ల‌ను ఈ ఓటీటీ షోలోకి ర‌ప్పించారు. అయితే తెలుగు బిగ్ బాస్ ఓటీటీ షో లో యాంక‌ర్ శ్రీ‌ముఖితోపాటు ప‌లువురు పాత కంటెస్టెంట్లు కూడా పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ షో ఏవిధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. దీన్ని రోజుకు 24 గంట‌లూ 82 రోజుల పాటు లైవ్‌లో ప్ర‌సారం చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now