Bigg Boss OTT Telugu : తెలుగు బుల్లితెరపై అత్యంత ఎక్కువ సక్సెస్‌ను సాధించిన షోలలో బిగ్ బాస్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. మొన్నీ మధ్య సీజన్ 5 ఆసక్తికరంగా ముగిసింది. ఈ క్రమంలోనే షోకు లభిస్తున్న ఆదరణను చూసి నిర్వాహకులు బిగ్ బాస్ ఓటీటీకి ప్లాన్ చేశారు. దీనిపై నాగార్జున గతంలోనే అధికారికంగా వివరాలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షోను ఈ నెల 26వ తేదీన ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక ఈ షోకు గాను ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వారిని మరో నాలుగైదు రోజుల్లో క్వారంటైన్‌కు కూడా పంపిస్తారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు షో కేవలం ఓటీటీలో మాత్రమే ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ షోను ప్రసారం చేస్తారు. రోజుకు 24 గంటలూ ఈ షోను లైవ్‌లో ప్రసారం చేయనున్నారు. తెలుగులో ఒక షోను ఇలా రోజుకు 24 గంటలూ లైవ్‌లో ప్రసారం చేయడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. దీంతో ఈ షో ఎలా ఉంటుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ షో 84 రోజుల పాటు కొనసాగనుంది. నాగార్జుననే దీనికి మళ్లీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…