CM KCR : ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డం వెనుక కార‌ణం ఇదేనా ?

CM KCR : తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న ఏమో గానీ.. ఆయ‌న వ‌చ్చి వెళ్లాక.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఇరు పార్టీల నేత‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర బీజేపీ నాయ‌కులు ఓ వైపు, తెరాస మంత్రులు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు ఓ వైపు.. ఒక‌రి మీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఒక‌రు ఇస్తున్న కౌంట‌ర్‌కు ఇంకొక‌రు ప్ర‌తిగా కౌంట‌ర్ వేస్తున్నారు.

CM KCR PM MODI

అయితే ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కాలేదు. త‌న‌కు బ‌దులుగా ఆ స్థానంలో మోదీని రిసీవ్ చేసుకునే బాధ్య‌త‌ను ఆయ‌న మంత్రి త‌ల‌సానికి అప్ప‌గించారు. అయితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై ఇటు బీజేపీ నేత‌ల‌తోపాటు కాంగ్రెస్ నేత‌లు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల‌కు పెట్టింద‌ని పేర‌ని విశ్లేష‌కులు అంటారు. అందుక‌ని ఆయ‌న కార‌ణం లేకుండా ఏ ప‌ని చేయ‌రు. ఆయ‌న ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు రాక‌పోవ‌డం వెనుక కూడా ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని, ఓ వ్యూహం ప్ర‌కార‌మే ఆయ‌న ఆ విధంగా చేశార‌ని అంటున్నారు.

బీజేపీని వ్యూహాత్మ‌కంగా రెచ్చ‌గొట్ట‌డం ద్వారా వారితో తిట్లు తిని.. అనంత‌రం తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి చొప్పించి త‌ద్వారా ఎన్నిక‌ల‌కు వెళితే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని.. సీఎం కేసీఆర్ భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లోనూ మ‌మ‌త ఇలాంటి ఫార్ములానే వాడారు. ఇక తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఇదే ఫార్ములాను వాడుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకీ బ‌లం పుంజుకుంటున్న నేప‌థ్యంలో కేంద్రం వర్సెస్ తెలంగాణ అనే నినాదాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెస్తే.. అప్పుడు ప్ర‌జ‌లు క‌చ్చితంగా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారు. అందుక‌నే సీఎం కేసీఆర్ ఆ విధమైన వ్యూహాన్ని అనుస‌రిస్తున్నార‌ని తెలుస్తోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుండా కేంద్రంపై ఇలా మాట‌ల యుద్ధం చేసే వ్యూహాన్ని ఇప్ప‌టి నుంచే అనుస‌రిస్తే త‌ద్వారా సీఎం కేసీఆర్‌కు రెండు విధాలుగా లాభం క‌లుగుతుంద‌ని అంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ను కాద‌ని, బీజేపీని తెరాస‌కు ప్ర‌త్య‌ర్థిగా చేయ‌డం, ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం, మ‌రోవైపు జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క‌పాత్ర పోషించ‌డం.. ఇలా రెండు విధాలుగా ఈ వ్యూహం క‌ల‌సి వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నార‌ని స‌మాచారం. అందుక‌నే మొద‌టి స్టెప్‌లో భాగంగా ఆయ‌న ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది.

ఇక మోదీ ప‌ర్య‌ట‌న అనంత‌రం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు గ‌త 3, 4 రోజుల నుంచి దూకుడు పెంచారు. సోష‌ల్ మీడియాలో వారు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. బీజేపీకి సోష‌ల్ మీడియా బ‌లం ఎక్కువ క‌నుక ఆ విధంగా ఆ పార్టీపై పోరాటం చేసేందుకు ట్వీట్‌ల‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ వార్ ఒక రేంజ్‌లో న‌డుస్తోంది. వేర్ ఈజ్ ఈక్వాలిటీ ఫ‌ర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్‌తో టీఆర్ఎస్ నాయ‌కులు బీజేపీ నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను, రాష్ట్రానికి ఇస్తామ‌న్న హామీల‌ను మోడీ వెంట‌నే నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ కూడా కౌంట‌ర్ అటాక్ ఇస్తున్న‌ప్ప‌టికీ టీఆర్ఎస్ అనుస‌రిస్తున్న ఈ స‌డెన్ వ్యూహంతో బీజేపీ కొంత డైల‌మాలో ప‌డిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి బీజేపీ నేత‌లు టీఆర్ఎస్ అటాక్‌ను ఏవిధంగా తిప్పికొడ‌తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM