Bigg Boss 5 : బిగ్ బాస్ 5 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విశ్వ‌..!

November 6, 2021 10:28 PM

Bigg Boss 5 : రాను రాను బిగ్ బాస్ సీజ‌న్ 5 ఎంతో ఆస‌క్తిగా సాగుతోంది. వారాంతాల్లో కంటెస్టెంట్ల‌తో నాగార్జున సంద‌డి చేస్తున్నారు. దీంతో షోకు మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటోంది. ఇక ఈ వారం ఫిట్ నెస్ మోడ‌ల్ విశ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్ర‌మించాడు. ఆరంభంలో విశ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. కానీ రాను రాను బ‌ల‌హీనమైన కంటెస్టెంట్‌గా మారాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

Bigg Boss 5 vishwa got evicted from house

స‌న్నీ, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి, కాజ‌ల్‌, ప్రియాంక‌, ర‌వి, జెస్సీ, విశ్వ‌లు ఈ వారం నామినేట్ అయ్యారు. విశ్వ టాస్క్‌ల‌తో పాపుల‌ర్ అయిన‌ప్ప‌టికీ అత‌నికి ఈ వారం ఓట్లు త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే అత‌ను ఎలిమినేట్ అయిన‌ట్లు స‌మాచారం.

ఇక విశ్వ ఎలిమినేష‌న్‌తో ప్ర‌స్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల మ‌ధ్య పోటీ మ‌రింత పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ తెలుగు 5 డిసెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ క్ర‌మంలోనే షో చివ‌రి వ‌ర‌కు ఇంకా ఎక్కువ ఆస‌క్తి నెల‌కొంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment