Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుండి 9 మంది హౌజ్‌మేట్స్ బయటకు రాగా, ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారనే చర్చ గత కొద్ది రోజులుగా నడుస్తోంది. అయితే ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుండగా, ఆదివారం ఎలిమినేట్ అయిన విశ్వ ఉన్న పది మందికి ఎవరి స్థానం ఏంటో చెప్పాడు. ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్ ఇచ్చాడు.
కాజల్‌ను తొమ్మిదో స్థానంలో పెట్టేశాడు. ఆటలో తన మీద తనకే నమ్మకాన్ని కోల్పోతోంది. తనది తాను కోల్పోతోంది. జెస్సీ మధ్యలో ఆటను వదిలేస్తున్నాడని ఎనిమిదో స్థానంకే పరిమితం చేశాడు. గేమ్‌లో గివప్ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడిని 8వ స్థానంలో ఉంచాడు. అనీ ఫైటర్ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు. మానస్‌ను ఆరో స్థానంలో పెట్టేసిన విశ్వ.. గెలుపోటములు ఒకేలా తీసుకోలేడని చెప్పాడు. సిరి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉంది.. ఏమున్నా కూడా మొహం మీదే చెబుతుందంటూ ఐదో స్థానంలో పెట్టేశాడు.
సన్నీకి నాలుగో స్థానం ఇచ్చిన విశ్వ.. ఫైర్ మెయింటైన్ చేయాలని అన్నాడు. ఇక షణ్ముఖ్‌కి మూడో స్థానం ఇస్తూ.. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఉండడం గొప్ప విషయం అన్నాడు. ఇక రవిని అందరూ గుంటనక్క అంటారు. కానీ అది స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అవసరం లేకపోయినా కూడా వెళ్లి చెబుతాడు. ఇకపై అలా చేయకు అంటూ రెండో స్థానాన్ని ఇచ్చాడు. శ్రీరామచంద్రకు తొలి స్థానం ఇచ్చిన విశ్వ.. నిన్ను చూస్తే నా తమ్ముడు గుర్తొస్తాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు. మనసులో ఏముంటే అదే చెబుతాడు.. నటించడు అంటూ శ్రీరామ్ పై ప్రశంసలు కురిపించాడు విశ్వ. మరి విశ్వ ఇచ్చిన ర్యాంకుల ప్రకారమే బిగ్ బాస్ కొనసాగుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…