Bigg Boss 5 : ట్విస్ట్ అదిరింది.. ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌నా ?

October 24, 2021 8:09 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అంటేనే ప‌లు ట్విస్ట్‌ల‌తో సాగుతుంటుంది. హౌజ్‌లో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు.. అనేది చెప్ప‌డం క‌ష్టం. ఇప్ప‌టికే హౌజ్ నుండి ఆరుగురు స‌భ్యులు ఎలిమినేట్ కాగా, ఈ రోజు ఒక‌రు ఎలిమినేట్ కానున్నార‌ని అంద‌రు భావించారు. ముందు అనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అవుతుంద‌ని అనుకున్నారు, కానీ త‌ర్వాత ప్రియ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు డ‌బుల్ ఎలిమినేష‌న్ అనే వార్త‌లు వ‌స్తున్నాయి.

Bigg Boss 5 twist is adurs double elimination this week

తాజాగా రిలీజైన ప్రోమోలో అనీ, ప్రియ తప్ప అందరూ సేవ్‌ అయినట్లు చూపించారు. ఇద్ద‌రు హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించారు నాగ్‌. అనంతరం వారిని గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బాక్సుల్లోకి వెళ్లమనగా ప్రియ, అనీ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఖాళీ బాక్సుల్లోకి వెళ్లారు. లైట్స్ ఆఫ్ అయిన త‌ర్వాత చెక్ చేయ‌గా, రెండు బాక్సులు ఖాళీ అయ్యాయి. దీంతో నాగార్జున ఇద్ద‌రు స్టేజ్‌పైకి వ‌స్తారేమోనంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

గ‌త సీజ‌న్ క‌న్నా ఈ సీజ‌న్‌లో ఎక్కువ మంది స‌భ్యుల‌ని ఇంట్లోకి ప్ర‌వేశ పెట్టారు. దీంతో డ‌బుల్ ఎలిమినేష‌న్ ఎప్పుడో ఒకసారి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అదెప్పుడు అనేది అంద‌రికీ స‌ర్‌ప్రైజింగ్‌గానే మారింది. అయితే ఈవారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ప‌క్కా ఉంటుంద‌ని కొంద‌రు అంటున్నారు. కాగా.. ఈ వారం కాజ‌ల్‌, సిరి, ర‌వి, అనీ, ప్రియ‌, శ్రీరామ్‌, జెస్సీ, లోబో నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్‌, కాజల్‌ను నాగ్‌ శనివారం ఎపిసోడ్‌లో సేవ్‌ చేశారు. సిరి, రవి, అనీ, ప్రియ, జెస్సీ, లోబో డేంజ‌ర్ జోన్‌లో ఉండ‌గా, అంద‌రినీ సేవ్ చేసి ప్రియ‌, అనీల‌ను ఇంటి నుండి బ‌య‌ట‌కు పంప‌బోతున్నారంటూ ప్ర‌చారం జరుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment