Bigg Boss 5 : బిగ్ బాస్ 5.. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళే..!

November 17, 2021 1:49 PM

Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా హీట్ గా సాగింది. ఎనిమిది మంది హౌస్ మేట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. నామినేషన్ల లిస్ట్ లో సిరి, షన్ను, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, ప్రియాంకలు ఉన్నారు. మరి ఈ వీక్ ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం కాస్త కష్టంగా మారింది.

Bigg Boss 5 these are the contestants are in danger zone this week

రీసెంట్ గా జరిగిన నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువ డేంజర్ జోన్ లో ఉన్నారనేది అంచనా వేయొచ్చు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్స్ వారి సోషల్ మీడియా అకౌంట్స్.. వారిపై వచ్చే కామెంట్స్.. ఫాలోవర్స్ గురించి చెక్ చేస్తే.. ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అనీ మాస్టర్, సిరి, ప్రియాంకలు ఈ వీక్ కాస్త డల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాజల్ తన పర్ఫార్మెన్స్ పై గ్రిప్ సాధించడంతో రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. అత్యధిక ఓటింగ్ లో ఉంది.

ప్రేక్షకుల సపోర్ట్ తో కాజల్ ఈ వీక్ సేఫ్ అయ్యేలాగే ఉంది. ఇక సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మానస్ ఎలాగో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అలాగే సిరి బిహేవియర్ కారణంగా ఆమె డేంజర్ జోన్ లోనే ఉంది. అనీ మాస్టర్ కూడా తన మాటలు, చేష్టలతో డేంజర్ జోన్ లో ఉంది. కనుక ఈ వీక్ సిరి, అనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ లో ఉంటారని.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now