Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజన్‌లో అందరు ఇంటి సభ్యుల్లాగే వీజే సన్నీ కూడా పాపులారిటీని పొందాడు. నమ్మకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. సన్నీ తన నిజాయితీ అయిన వైఖరితో బిగ్ బాస్ హౌస్ లో పాపులర్ అయ్యాడు. ఇక కొందరు స్నేహితులను కూడా హౌస్ లో సంపాదించుకున్నాడు. ముఖ్యంగా కష్ట సమయాల్లో మానస్ అతనికి సహకారం అందిస్తున్నాడు.
ఇక నామినేషన్స్ సమయంలో సన్నీని అనీ మాస్టర్ జైలులోకి పంపారు. అయితే ఆ రోజు నుంచీ సన్నీకి ఫేమేల్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగిందట. అది ఎందుకని అంటే.. ఆ రోజు అతను ధరించిన ఔట్ ఫిట్ వల్లే అని తేలింది.
శ్రీరామ్ చంద్ర, జెస్సీ ఇప్పటి వరకు ఇంట్లో హ్యాండ్ సమ్ అనే పేరు సంపాదించారు. అయితే ఆ క్లబ్‌లో తాజాగా సన్నీ చేరిపోయాడు. సన్నీ ఆ రోజు గ్రీన్ వెల్వెట్ ధరించడమే కాక లవ్ సింబల్ చూపించాడు. దీంతో ఆ స్టైల్ చాలా మంది ఫీమేల్ ప్రేక్షకులకు నచ్చిందట. ఈ క్రమంలోనే వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
సన్నీ గ్రీన్ కలర్ డ్రెస్‌లో బాగున్నాడు.. అని కొందరు కామెంట్లు చేస్తే.. అతను నా క్రష్ అని కొందరు కామెంట్లు చేశారు. అతను ఇంట్లోనే కాదు, బయట కూడా హ్యాండ్‌సమ్ పర్సనే.. అని ఇంకొందరు కామెంట్లు పెట్టారు. దీంతో సన్నీ పాపులారిటీ ఫీమేల్ ప్రేక్షకుల్లో బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. మరి అతనికి ఓట్లు పడేందుకు అది ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…