Bigg Boss 5 Telugu : బుల్లితెరపై మూడు వారాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగవ వారం ఎంతో రసవత్తరంగా ప్రసారమవుతుంది బిగ్ బాస్ కార్యక్రమం. 19 మంది కంటెస్టెంట్ లతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్ లో 16 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈ కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన గొడవలు, పోట్లాటలు చోటు చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత వినోదం అందిస్తున్నారు.
అయితే గత కొద్దిరోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక ప్రముఖ యాంకర్ ను పంపించడం కోసం బిగ్ బాస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన లేడీ యాంకర్ విష్ణు ప్రియను బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపించడానికి ఏర్పాటు చేసినట్లు సమాచారం.
బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటేనే ఆ కథ వేరేగా ఉంటుంది. అలాంటిది యాంకర్ విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వబోతున్నది అంటే బిగ్ బాస్ లో మరింత సందడి, ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి బిగ్ బాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…