Republic Movie : దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం రిపబ్లిక్. ఈ మూవీ అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా ఈ మూవీకి మంచి ఆదరణ వస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక రిపబ్లిక్ మూవీకి గాను కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే ప్రీమియర్ షోను చూశారు. దీంతో వారు కూడా మూవీ బాగుందని కితాబిచ్చారు. నటుడు నాని ఈ సినిమా చూసి ట్వీట్ చేశారు. రిపబ్లిక్ మూవీ చూశా. సాయి కోసం అభిమానుల ప్రార్ధనలు రిపబ్లిక్ రూపంలో ఫలిచించాయి. దేవాకట్టా చెప్పినట్లు సాయి తేజ్ ఈజ్ బ్యాక్. టీం అందరికీ కంగ్రాట్స్ అని.. నాని ట్వీట్ చేశారు.
ఇక ఈ మూవీని చూసిన సింగర్ స్మిత కూడా దీనిపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని, దేవా కట్టాకు రిపబ్లిక్ కొత్త ప్రస్థానం అని, సాయి తేజ్ బాగా చేశాడని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని, అందరి స్పందన కోసం ఎదురు చూస్తున్నాను.. అంటూ స్మిత పోస్ట్ చేసింది.
అయితే ఈ మూవీ ప్రీమియర్ షోను చూసిన ఇతర సెలబ్రిటీలు కూడా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో మూవీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చిత్ర దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. కాగా సాయి ధరమ్ తేజకు రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడంతో హాస్పిటల్‌లో కాలర్ బోన్‌కు శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన ఓకే చెప్పడంతోనే సినిమాను విడుదల చేస్తున్నామని దర్శకుడు దేవా కట్టా తెలిపారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…