Bigg Boss 5 : సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ ఎంత వాడివేడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 11 వారం కూడా నామినేషన్ రచ్చ హాట్‌గానే సాగింది. అయితే నామినేషన్ ప్రక్రియకు ముందు సన్నీ.. గత వారం జరిగిన విషయాలను తలచుకొని చాలా బాధపడ్డాడు. ఎవడ్నైనా బ్యాడ్ చేయడానికి అవకాశం దొరికితే బ్యాడ్ చేయాలనే చూస్తాడు రవి.. మెజారిటీ పీపుల్ తన వైపున ఉన్నారని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు.
మరోవైపు సిరి, షణ్ముఖ్‌లు సన్నీ గురించి తిట్టుకుంటూ కనిపించారు. తమని యూట్యూబ్ వరకూ అని అన్నాడని తెగ చించుకున్న ఈ ఇద్దరూ సన్నీ గుర్తింపు గురించి తెగ మాట్లేడుసుకున్నారు. ఇంటి బిగ్ బాస్ గుంటనక్కగా పేరొందిన రవి.. కాజల్ గురించి మాట్లాడుతూ ఆమెకు కన్నింగ్ అని కరెక్ట్ పదం ఇచ్చారని చెప్పాడు. ఇక అనీ మాస్టర్ అయితే.. సన్నీ, మానస్‌లు చాలామంచి వాళ్లే.. కానీ కాజల్ వాళ్ల బ్రెయిన్ వాష్ చేస్తుందని.. గుసగుసలాడింది.
ఇక హౌస్‌లో ఉన్న వాళ్లని నటరాజ్ మాస్టర్ లాగే జంతువులతో పోల్చాడు సన్నీ. అనీ మాస్టర్ అయితే కచ్చితంగా పాము అని అన్నాడు. రవికి ఏ జన్మకైనా నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే కరెక్ట్. గుంట నక్క సరిగ్గా సరిపోతుంది.. సిరి అయితే కట్లపాము.. షణ్ముఖ్ అయితే నల్ల నక్క.. నాకు నేను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేర్లు పెట్టాడు. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సన్నీ మెడలో ఉన్న గిల్టీ బోర్డ్‌ని తీసేయమని బిగ్ బాస్ యాంకర్ రవిని ఆదేశించారు.
11వ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల తలపై బాటిల్‌లో ద్రవాన్ని పోయాలని ఆదేశించాడు బిగ్ బాస్. ముందుగా కెప్టెన్ రవి.. తనను ఫేక్ అనడం నచ్చలేదంటూ సన్నీని, సన్నీని రెచ్చగొట్టిందంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. ఒక్కొక్కరు పలు కారణాలు చెప్పుకుంటూ నామినేట్ చేసుకున్నారు. మొత్తంగా ఈ వారం రవి తప్ప.. మిగతా వారందరూ నామినేషన్‌లోకి వెళ్లారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…