గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : హౌజ్‌మేట్స్‌కి జంతువుల పేర్లు పెట్టిన స‌న్నీ.. నామినేష‌న్స్‌లో ఆ ఒక్క‌డు త‌ప్ప మిగతా అంద‌రూ..!

Bigg Boss 5 : సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ప్ర‌క్రియ ఎంత వాడివేడిగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 11 వారం కూడా నామినేష‌న్ ర‌చ్చ హాట్‌గానే సాగింది. అయితే నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు ముందు స‌న్నీ.. గ‌త వారం జ‌రిగిన…

Bigg Boss 5 : హౌజ్‌మేట్స్‌కి జంతువుల పేర్లు పెట్టిన స‌న్నీ.. నామినేష‌న్స్‌లో ఆ ఒక్క‌డు త‌ప్ప మిగతా అంద‌రూ..!

Bigg Boss 5 : సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ ప్ర‌క్రియ ఎంత వాడివేడిగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 11 వారం కూడా నామినేష‌న్ ర‌చ్చ హాట్‌గానే సాగింది. అయితే నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు ముందు స‌న్నీ.. గ‌త వారం జ‌రిగిన విష‌యాల‌ను త‌ల‌చుకొని చాలా బాధ‌ప‌డ్డాడు. ఎవడ్నైనా బ్యాడ్ చేయడానికి అవకాశం దొరికితే బ్యాడ్‌ చేయాలనే చూస్తాడు రవి.. మెజారిటీ పీపుల్‌ తన వైపున ఉన్నారని దాన్ని అవకాశంగా తీసుకున్నాడు.

Bigg Boss 5  sunny given names to house mates all are in nomination except ravi

మరోవైపు సిరి, షణ్ముఖ్‌లు సన్నీ గురించి తిట్టుకుంటూ కనిపించారు. తమ‌ని యూట్యూబ్ వరకూ అని అన్నాడని తెగ చించుకున్న ఈ ఇద్దరూ సన్నీ గుర్తింపు గురించి తెగ మాట్లేడుసుకున్నారు. ఇంటి బిగ్ బాస్ గుంటనక్కగా పేరొందిన రవి.. కాజల్ గురించి మాట్లాడుతూ ఆమెకు కన్నింగ్ అని కరెక్ట్ పదం ఇచ్చారని చెప్పాడు. ఇక అనీ మాస్టర్ అయితే.. సన్నీ, మానస్‌లు చాలామంచి వాళ్లే.. కానీ కాజల్ వాళ్ల బ్రెయిన్ వాష్ చేస్తుందని.. గుసగుసలాడింది.

ఇక హౌస్‌లో ఉన్న వాళ్లని నటరాజ్ మాస్టర్ లాగే జంతువులతో పోల్చాడు సన్నీ. అనీ మాస్టర్ అయితే కచ్చితంగా పాము అని అన్నాడు. రవికి ఏ జన్మకైనా నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే కరెక్ట్. గుంట న‌క్క స‌రిగ్గా స‌రిపోతుంది.. సిరి అయితే కట్లపాము.. షణ్ముఖ్ అయితే నల్ల నక్క.. నాకు నేను పేరు పెట్టుకోవాలంటే చింపాంజీ అని పేర్లు పెట్టాడు. ఆ తరువాత నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కావడంతో సన్నీ మెడలో ఉన్న గిల్టీ బోర్డ్‌ని తీసేయమని బిగ్ బాస్ యాంకర్ రవిని ఆదేశించారు.

11వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తుల త‌ల‌పై బాటిల్‌లో ద్ర‌వాన్ని పోయాల‌ని ఆదేశించాడు బిగ్ బాస్. ముందుగా కెప్టెన్ ర‌వి.. త‌న‌ను ఫేక్ అన‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని, స‌న్నీని రెచ్చ‌గొట్టిందంటూ కాజ‌ల్‌ను నామినేట్ చేశాడు. ఒక్కొక్క‌రు ప‌లు కార‌ణాలు చెప్పుకుంటూ నామినేట్ చేసుకున్నారు. మొత్తంగా ఈ వారం ర‌వి త‌ప్ప.. మిగ‌తా వారంద‌రూ నామినేష‌న్‌లోకి వెళ్లారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి