Bigg Boss 5 : కాగితాలు, పాల ప్యాకెట్లు ఏరుకునే వాడిలా ఉన్నాడంటూ.. ష‌ణ్ముఖ్‌పై ఫైర్..!

November 30, 2021 12:06 PM

Bigg Boss 5 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 7 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా, ఇందులో ఎవ‌రు విన్‌ అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. అయితే ప్ర‌స్తుతం హౌజ్‌లో ఉన్న‌వారికి స‌పోర్ట్ తోపాటు విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా ఓ నెటిజ‌న్ ష‌ణ్ముఖ్‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది.. పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది.. మీరే కదా.. గుర్తుపట్టాను.

Bigg Boss 5 : కాగితాలు, పాల ప్యాకెట్లు ఏరుకునే వాడిలా ఉన్నాడంటూ.. ష‌ణ్ముఖ్‌పై ఫైర్..!

మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్‌ నీలాగే ఉంటడు షణ్ను.. అంటూ విపరీత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గత సీజన్‌ రన్నరప్‌ అఖిల్‌ సార్థక్‌ ఘాటుగా స్పందించాడు. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పు ! ఒకరు మీకు నచ్చలేదంటే వాళ్లను మీరు బాడీ షేమింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. మరీ అంతలా ద్వేషించకండి ! ఇది ఒక గేమ్‌ షో మాత్రమే అని అన్నాడు.

ఇది చూసి ఎంజాయ్‌ చేయండంతే ! మరీ ఇంత నెగెటివిటీ వద్దు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా ఈజీ. నువ్వు ఆ గేమ్‌ షోలో ఉండి ఉంటే నిన్ను ఎవరైనా ఇలా ట్రోల్‌ చేస్తే నీకు తెలుస్తుంది ఆ బాధేంటో ! వయసు పెరగడం కాదు, బుద్ధి కూడా పెరగాలి అని అన్నాడు.

‘మీకు నచ్చిన కంటెస్టెంట్‌ను గెలిపించడం కోసం అవతలి వారిని కించపరచడం చాలా తప్పు. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎ‍ప్పుడు చచ్చిపోతమో తెలీదు, ఎందుకు బ్రో ఇంతగా నెగెటివిటీ. వేధించడం మానేసి పాజిటివిటీని వ్యాప్తి చేయండి. గేమ్‌ షోను గేమ్‌ షోలా మాత్రమే చూడండి’ అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై షణ్ను ప్రేయసి దీప్తి సునయన.. అఖిల్‌కి థ్యాంక్స్ చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment