Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ప్రతీది ఓ సంచలనమే. లేటెస్ట్ గా ఎలిమినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ఇంటి నుండి బయటకు వచ్చేశారు. ఇక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాల్ని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి క్లియర్ గా వివరించారు. విశ్వ గురించి మాట్లాడుతూ అతని కోపాన్ని విశ్వ ఫోటో మీద చూపిస్తూ తన్ని, గట్టిగా అరిచారు. నెక్ట్స్ రవి టాస్క్ వచ్చినప్పుడు నత్తలాగా.. నామినేషన్ లో గుంటనక్కలా వ్యవహరిస్తాడని అన్నారు. శ్వేత బిగ్ బాస్ లో ఓ అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుందని, ప్రియ ఫిట్టింగ్ మాస్టర్ అని అన్నారు.
జెస్సీ ఇంకా పిల్లాడు అంటూ శ్రీరామచంద్ర ముద్ద పప్పులా వచ్చాడని, బిగ్ బాస్ హౌస్ లో యాక్టింగ్ చేస్తున్నాడని అన్నారు. కాజల్ సీక్రెట్ గా చెవుల్లో మాట్లాడకూడదని మైక్ ధరించాలంటూ డైరెక్ట్ గా తెలిపారు. షణ్ముక్ పరమానందయ్య శిష్యుడని, తనకు చాలా తెలివి ఉంది గానీ వాడట్లేదన్నాడు. లోబో డస్ట్ బిన్ లో ఫుడ్ వెతుక్కోవడంపై అరియానా క్వశ్చన్ అడగ్గా అదంతా డ్రామా అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పాడు.
ఇక లోబోని పొగుతూనే తిట్టాడు. ఎందుకంటే లోబో ఇంకా రవి వేసుకున్న మాస్క్ లోనే ఉండిపోతున్నాడని.. అతని మాస్క్ నుండి బయటకు వస్తే అంతా బావుంటుందని అన్నారు. నటరాజ్ మాస్టర్ తో జరిగిన ఈ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అరియానాతో మరిన్ని బిగ్ బాస్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…