Tollywood : టాలీవుడ్‌కి ఇదో కొత్త గండమా.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రికి ఎందుకిలా జ‌రుగుతోంది ?

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరోలకు వరుసగా యాక్సిడెంట్స్, షూటింగ్ లలో దెబ్బలు, పలు రకాల తీవ్రమైన జ్వరాలతో.. ఒకరి తర్వాత మరొకరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇండస్ట్రీకి ఇదేమైనా శాపమా అనే అనుమానం రేకెత్తుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్ని వెంటాడుతున్న ఈ సమస్య ఏంటో అంటూ.. నెటిజన్లు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సరిగ్గా వినాయకచవితి నాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలయిన సాయి తేజ్ స్పృహ కోల్పోయి మరీ హాస్పిటల్ చేరారు.

Tollywood : హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్

ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగానే ఉంది.. తనను, తన సినిమాను ఆదరించినవారందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే వచ్చేస్తానంటూ ఓ ఫోటోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ డౌన్ అయ్యి రెండు వారాలుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక్కడ అంతా క్షేమం.. అంటూ సన్ ఫ్లవర్ లుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధ్ కు కూడా మహాసముద్రం షూటింగ్ లో గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. రెపో 19 సినిమా షూటింగ్ లో రామ్ పోతినేనికి సైతం మెడకు గాయం అవ్వడంతో ఇక ఈ విషయంలో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదైనా గండం ఉందా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM