Bigg Boss 5 : ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి సౌత్ ఇండియాలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అనీ మాస్టర్. మంచి టాలెంట్ ఉన్న ఈమె చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. అయితే ఈమె రూపం ఒక్కోసారి పలు అవమానాలకు గురి చేసింది. ఈ విషయాన్ని ఓ షోలో అనీ మాస్టర్ షేర్ చేసుకొని ఆవేదన వ్యక్తం చేసింది. చైనీస్ వ్యక్తి లాగా ఉంటారని చాలా మంది కామెంట్ చేశారట.
తాము భారతీయులమేనని, కానీ చాలా మంది తమను చైనీస్ అంటూ వెక్కిరిస్తుంటారని చెప్పుకొచ్చింది. ఓ ప్రోగ్రాంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా అనీ మాస్టర్ ను పట్టుకొని చైనీస్ బొమ్మ అంటూ కామెంట్ చేశాడు. ఆ మధ్య తన పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పుస్తకాలు కొనేందుకు మెహదీపట్నం వెళ్లగా, అక్కడ కొందరు తనను చూసి చైనీస్ మహిళ అంటూ వ్యాఖ్యానించారని, అంతటితో ఆగకుండా అదిగో కరోనా వైరస్ వెళుతోంది అంటూ అవమానించారని చెప్పి.. కన్నీటి పర్యంతం అయింది అనీ మాస్టర్.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న అనీ మాస్టర్ చాలా గట్టి పోటీ ఇస్తోంది. కానీ గొడవలు ఈమెకు మైనస్‌గా మారాయి. అయితే అనీ మాస్టర్ నామినేషన్‌లో వస్తే ఎలిమినేషన్ పక్కా అని.. ఈ వారం నామినేషన్ లో ఉంది కాబట్టి పక్కా ఎలిమినేట్ కానుందంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మోనాల్ స్పందిస్తూ.. కొన్ని అనధికారిక పోల్స్ అప్పుడే అనీ మాస్టర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమె ఎంతో స్ట్రాంగ్. జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా పైకి వచ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాలన్న ఆశతో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం. దయచేసి ఆమెకు ఓటేయండి.. అని అభిమానులను అభ్యర్థించింది మోనాల్.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…