Health Tips : చ‌లికి త‌ట్టుకోలేక‌పోతున్నారా ? శ‌రీరం వెచ్చ‌గా ఉండాలంటే.. రోజూ వీటిని తీసుకోండి..!

Health Tips : చ‌లికాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే చ‌లికి ముసుగు త‌న్ని ప‌డుకునేందుకే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఒళ్లంతా బ‌ద్ద‌కంగా అనిపిస్తుంటుంది. ఇక ఉద‌యం అయితే త్వ‌ర‌గా నిద్రలేవ‌బుద్ది కాదు. అయితే చ‌లికాలంలో మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం ఎంత ముఖ్య‌మో.. మ‌న శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌లో కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

1. ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ సీజ‌న్‌లో నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. అలాగే ఈ సీజ‌న్‌లో మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంది క‌నుక నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ద‌గ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస కోశ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క‌నుక ఈ సీజ‌న్‌లో రోజూ త‌ప్ప‌నిసరిగా నెయ్యిని తీసుకోవాలి.

2. ముల్లంగిలో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. రోజూ ముల్లంగిని తిన‌లేని వారు ఒక క‌ప్పు జ్యూస్ రూపంలోనూ తీసుకోవ‌చ్చు. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది.

3. ఉల్లిపాయ‌లు, వెల్లుల్లిల‌లో అనేక ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని అనేక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. ఈ సీజ‌న్‌లో ఈ రెండింటినీ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉండ‌డ‌మే కాదు, శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది.

4. రోజూ అల్లం ర‌సం సేవించ‌డం వ‌ల్ల కూడా శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. లేదా అల్లంను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని తాగుతుండాలి.

5. ఆవాలు, నువ్వుల‌ను లేదా వాటితో త‌యారు చేసే నూనెల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. ఈవిధంగా చేయ‌డం వ‌ల్ల చ‌లికాలంలో చ‌లిని తరిమికొట్టి శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM