Bigg Boss 5 : అనీ మాస్ట‌ర్ విష‌యంలో అభిమానుల‌ని వేడుకున్న మోనాల్ గ‌జ్జ‌ర్..!

November 17, 2021 1:05 PM

Bigg Boss 5 : ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి సౌత్ ఇండియాలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అనీ మాస్ట‌ర్. మంచి టాలెంట్ ఉన్న ఈమె చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. అయితే ఈమె రూపం ఒక్కోసారి ప‌లు అవమానాలకు గురి చేసింది. ఈ విషయాన్ని ఓ షోలో అనీ మాస్టర్ షేర్ చేసుకొని ఆవేదన వ్యక్తం చేసింది. చైనీస్ వ్యక్తి లాగా ఉంటారని చాలా మంది కామెంట్ చేశార‌ట‌.

Bigg Boss 5 monal requested to support anee master

తాము భారతీయులమేనని, కానీ చాలా మంది తమను చైనీస్ అంటూ వెక్కిరిస్తుంటారని చెప్పుకొచ్చింది. ఓ ప్రోగ్రాంలో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా అనీ మాస్టర్ ను పట్టుకొని చైనీస్ బొమ్మ అంటూ కామెంట్ చేశాడు. ఆ మ‌ధ్య తన పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పుస్తకాలు కొనేందుకు మెహదీపట్నం వెళ్లగా, అక్కడ కొందరు తనను చూసి చైనీస్ మహిళ అంటూ వ్యాఖ్యానించారని, అంతటితో ఆగకుండా అదిగో కరోనా వైరస్ వెళుతోంది అంటూ అవమానించారని చెప్పి.. క‌న్నీటి ప‌ర్యంతం అయింది అనీ మాస్ట‌ర్.

ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న అనీ మాస్ట‌ర్ చాలా గ‌ట్టి పోటీ ఇస్తోంది. కానీ గొడ‌వ‌లు ఈమెకు మైన‌స్‌గా మారాయి. అయితే అనీ మాస్ట‌ర్ నామినేష‌న్‌లో వ‌స్తే ఎలిమినేష‌న్ ప‌క్కా అని.. ఈ వారం నామినేష‌న్ లో ఉంది కాబ‌ట్టి ప‌క్కా ఎలిమినేట్ కానుందంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మోనాల్ స్పందిస్తూ.. కొన్ని అన‌ధికారిక పోల్స్ అప్పుడే అనీ మాస్ట‌ర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమె ఎంతో స్ట్రాంగ్‌. జీవితంలో ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఒంట‌రిగా పైకి వ‌చ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాల‌న్న ఆశ‌తో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె క‌ల‌ నెర‌వేరాల‌ని కోరుకుందాం. ద‌య‌చేసి ఆమెకు ఓటేయండి.. అని అభిమానుల‌ను అభ్య‌ర్థించింది మోనాల్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment