Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ షో ఆసక్తిని కనబరుస్తూ వివాదాలలోనూ చిక్కుకుంటూ ఉంటోంది. జస్వంత్ ఎలిమినేషన్ పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. బయట సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న జెస్సీని అనారోగ్యం పేరు చెప్పి ఎందుకు బయటకు పంపారంటూ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో జస్వంత్ పడాల అలియాస్ జెస్సీ మొదటి నుంచి కూడా ఒక చిన్న పిల్లాడి తరహాలో కొనసాగుతూ వచ్చాడు.
జెస్సీ ఫ్యాషన్ వరల్డ్ లో తప్పితే బయట జనాలకు పెద్దగా తెలియదు. అయితే అతను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం కొన్ని రోజులకే ఒక చిన్న పిల్లాడి మనస్తత్వంతో కనిపించాడు.. అని కంటెస్టెంట్స్ అందరూ కూడా కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా అదే తరహాలో స్పందించారు. మొత్తానికి పది వారాల పాటు కొనసాగిన జెస్సీ ఎవరూ ఊహించని విధంగా అనారోగ్యం కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అయితే పక్కా ప్లానింగ్ ప్రకారమే అంతా జరుగుతుందని, ఎలిమినేషన్ నుండి విన్నర్స్ వరకు షో నిర్వాహకులు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటారని సోషల్ మీడియాలో కొందరు ఈ షోను వ్యతిరేకిస్తూ.. వాదిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ కూడా ఇటు ప్రేక్షకుల ఓట్లతోపాటు షో నిర్వాహకుల ప్లాన్ ప్రకారమే జరిగిందని టాక్ నడుస్తోంది. విందులు, వినోదాలలో జెస్సీ భేషుగ్గా ఎంజాయ్ చేస్తుండగా, అనారోగ్యంతో ఏదో హడావిడి చేసిన బయటకు పంపారని కొందరు వాపోతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…