Rakul Preet Singh : టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా పెళ్లి దిశగా అడుగులేయబోతుంది.. అంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. జాకీ భగ్నానీ అనే నటుడితో ఆమె కొంత కాలంగా ప్రేమలో ఉండగా, తన 31వ పుట్టినరోజున ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. జాకీ భగ్నానీ కూడా ఇన్ స్టా పోస్ట్ ద్వారా రకుల్‌పై తన ప్రేమను తెలియజేశాడు. అయితే వీరి పెళ్లెప్పుడు.. అని అందరూ ఆలోచిస్తున్న క్రమంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది రకుల్.
థ్యాంక్స్ గాడ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రకుల్ మాట్లాడుతూ.. నా వ్యక్తిగత జీవితం గురించి అప్పుడు ఎందుకు బయటపెట్టానంటే.. అది ఓ అందమైన విషయం. అందరితో పంచుకోవాలనుకున్నా.పెళ్లికి అంత తొందరలేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. సో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. చేసుకోవాలనుకున్నప్పుడు మీ అందరితో పంచుకుంటాను’ అని పేర్కొంది. అంటే ఈ అమ్మడి పెళ్లికి మరి కొన్ని సంవత్సరాలు సమయం పట్టేలా కనిపిస్తోంది.
రకుల్ నటించిన థ్యాంక్స్ గాడ్ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది రకుల్.
కాగా ఈ అమ్మడు ప్రేమించిన జాకీ భగ్నానీ బాలీవుడ్ నటుడు, నిర్మాతగా రాణిస్తున్నాడు. ఈయన కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరు మీద అతని తండ్రి వషు భగ్నానీ మూవీస్ నిర్మిస్తున్నారు. జాకీ భగ్నానీ.. 2009లో ఓ హిందీ మూవీలో ఇండస్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…