Bigg Boss 5 : నామినేష‌న్‌లో ఆరుగురు హౌజ్‌మేట్స్.. ఎలిమినేట్ కానుంది ఎవ‌రు ?

October 26, 2021 7:00 PM

Bigg Boss 5 : సోమవారం వ‌చ్చిందంటే బిగ్ బాస్ అరుపుల‌తో హోరెత్తి పోతుంది. ఒక‌రిపై ఒక‌రు దారుణంగా ఆరోప‌ణ‌లు, నింద‌లు వేసుకుంటూ నానా హంగామా సృష్టిస్తుంటారు. కానీ తాజాగా జరిగిన నామినేష‌న్‌లో అలాంటివి ఏమీ లేవు. ఎమోష‌న‌ల్‌గా ఎపిసోడ్ సాగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటి సభ్యులను పవర్ రూంకు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్ లో రెండు లేఖలు ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుందని చెబుతాడు.

Bigg Boss 5 five members nominated who will be eliminiated

లెట‌ర్ అందుకున్న‌వారు సేవ్ కాగా, అందుకోని వారు నామినేష‌న్‌లో ఉంటారు. ముందుగా పవర్ రూంలోకి వెళ్లిన మానస్, శ్రీరామ్ లకు లోబో.. ప్రియాంక లేఖలు వచ్చాయి. ప్రియాంక కోసం తన లేఖను త్యాగం చేశాడు లోబో. ఆ తర్వాత షణ్ముఖ్‌, రవిలకు.. విశ్వ, సిరి లేఖలు అందాయి. ఇక విశ్వ కోసం తన లేఖను త్యాగం చేసింది సిరి. అనంత‌రం ప్రియాంక, కాజల్ కు అనీ మాస్టర్, మానస్ లేఖలు అందాయి. అనీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు

విశ్వ.. లోబోలకు రవి.. శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. ఇక రవి.. శ్రీరామ్ కోసం త‌న లేఖ‌ను త్యాగం చేశాడు. అనీ మాస్టర్, సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. కాజ‌ల్ కోసం ష‌ణ్ముఖ్ త‌న లేఖ‌ని త్యాగం చేశాడు. ఇలా నామినేష‌న్ ప్ర‌క్రియ చాలా ర‌స‌వత్త‌రంగా సాగుతూ వ‌చ్చింది. జెస్సీ కోసం శ్రీరామ్ త్యాగం చేశాడు. మొత్తం మీద ఈ వారం నామినేషన్ ప్రక్రియను హౌస్ మేట్స్ ఎమోషన్స్‏తో జత చేశాడు బిగ్ బాస్. ఈ వారం డేంజర్ జోన్‌లో లోబో, సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, రవి ఉన్నారు. ఇందులో లోబో లేదా సిరి ఎలిమినేట్ అవుతార‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment