Bigg Boss 5 : శ్వేతా వర్మ 6 వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

October 18, 2021 12:16 PM

Bigg Boss 5 : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా శ్వేత వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. 19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికి ఆరు మంది ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం 13 మంది సభ్యులు ఉన్నారు.

Bigg Boss 5 do you know about swetaa varma remuneration

ఈ వారం బిగ్ బాస్ శ్వేతను ఎలిమినేట్ చేయగా లోబోను సీక్రెట్ రూమ్ కి పంపించారు. ఇకపోతే ఆరు వారాల పాటు హౌస్‌లో ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన శ్వేతకు రెమ్యూనరేషన్ ఎంత చెల్లించి ఉంటారనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే 6వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ వారానికి రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె ఆరు వారాలకు గాను సుమారుగా రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్వేతా వర్మ పలు వెబ్ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా శ్వేతా వర్మ నటించిన ముగ్గురు మొనగాళ్లు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ సంపాదించుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment