Bigg Boss 5 : ఈ వారం నామినేష‌న్‌లో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్..!

November 1, 2021 1:31 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మానికి లీకుల బెడ‌ద చాలా ఉంది. ప్రోగ్రామ్ టెలికాస్ట్‌కి ముందే ఎవ‌రు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవ‌రు కెప్టెన్ అవుతున్నారు, ఎవ‌రు నామినేష‌న్‌లో ఉంటున్నార‌నే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా ఎలిమినేట్ అయిన లోబో గురించి గ‌త నాలుగు రోజుల నుండే జోస్యాలు చెప్పారు. ఎనిమిదో వారం లోబో అవుట్ అన్న‌ట్టు క‌థనాలు ప్ర‌చురించారు. ఈ క్ర‌మంలోనే తొమ్మిదో వారానికి సంబంధించి నామినేష‌న్ స‌భ్యుల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Bigg Boss 5 9 contestants in this week nomination

ఈ వారం నామినేష‌న్‌లో ఏకంగా 9 మంది నామినేట్ అయిన‌ట్టు స‌మాచారం. సిరి, స‌న్నీ, శ్రీరామ్, జెస్సీ, కాజల్, విశ్వ‌, మాన‌స్, ప్రియాంక‌, ర‌వి ఇలా మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయిన‌ట్టు తెలుస్తోంది. వీరిలో అంద‌రి క‌న్నా ఫాలోయింగ్ త‌క్కువ‌గా విశ్వ‌కి ఉన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతోంది. ఈ లెక్క‌న చూస్తే 9వ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ విశ్వ అనే చెప్పాలి. అది జ‌ర‌గ‌లేదంటే సిరిపై ఎఫెక్ట్ ప‌డొచ్చు.

ఆదివారం దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆకాశాన్ని తాకింది. తారల డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లిపోయింది. బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్లు చేసిన రచ్చను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండలను ఒకే స్క్రీన్‌పై చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. శ్రియ త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో చిల్ చేసింది. సుమ ఎప్పటిలానే త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకుంది. ఇక బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ ఘట్టం కూడా ముగిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment