Big Boss Himaja : కల్లు తాగుతూ రచ్చ చేసిన హిమజ.. వీడియో వైరల్!

March 16, 2022 9:48 PM

Big Boss Himaja : బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం సీరియల్స్ లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందిన తర్వాత బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇలా బిగ్ బాస్ తర్వాత ఈమె పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్లడమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో గుర్తింపు పొందింది.

Big Boss Himaja  drinking toddy video viral
Big Boss Himaja

ఇలా నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉన్న హిమజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. హిమజ కల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోకి ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసింది. ఇక ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Himaja???? (@itshimaja)

ఈ వీడియో చూసిన పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇలా హిమజ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉంది. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న హిమజ ఎన్నోసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కు గురయింది. తన గురించి చెడుగా ట్రోల్ చేసిన వారికి తనదైన శైలిలో బుద్ది చెబుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now