Bhimla Nayak : ప‌వ‌న్ మూవీ క‌వ‌ర్ సాంగ్ కోసం రూ.25 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నారా..?

November 3, 2021 7:59 PM

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానుల‌లో ఎంతో క్రేజ్ ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ సినిమాలు చేయ‌ను అనే స‌రికి అభిమానులే కాదు నిర్మాత‌లు కూడా డీలా ప‌డ్డారు. అయితే ఎలాగోలా ఆయ‌న‌ను ఒప్పించి వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చేలా చేశారు. ప‌వ‌న్‌కి ఉన్న మార్కెట్ బ‌ట్టి ఆయ‌న‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలే ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.

Bhimla Nayak makers spending rs 25 lakhs for only one song

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ‘భీమ్లా నాయక్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. జనవరి 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

తాజాగా క‌వ‌ర్ పాట‌కు సంబంధించి అనౌన్స్‌మెంట్ చేశారు. మ‌రి కొద్దిగంట‌ల‌లో పాట విడుద‌ల కానుండ‌గా, ఈ పాట‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పాట కోసం దాదాపుగా 30 మందికి పైగా బృందం పని చేస్తోంది. రూ.25 లక్షలకు పైగా ఖర్చు అవుతోందని తెలుస్తోంది. థ‌మ‌న్ ఈ పాట కోసం అదిరిపోయే బాణీలు సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ఈ కవర్ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి ప్ర‌తి ఎలిమెంట్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ ఎక్కించి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన‌వే. ఈ సినిమా నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీజ‌ర్‌, రానా టీజ‌ర్‌, రెండు పాట‌లు విడుదలై సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now