Bhanu Sree : పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భానుశ్రీ.. వరుడు అతడేనా..?

August 31, 2022 9:31 PM

Bhanu Sree : యాంక‌ర్ గా భానుశ్రీ అంటే అంద‌ర‌కీ సుప‌రిచిత‌మే. మొద‌ట్లో చిన్న చిన్న అవ‌కాశాల‌తో స‌రిపెట్టుకున్న ఆమె.. బుల్లి తెరపై పలు షోలు చేసి మంచి పేరు తెచ్చుకుంది కానీ అవన్నీ చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో కి వెళ్ళగానే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అంతే కాదు బిగ్ బాస్ వల్ల ఆమెకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. భానుశ్రీ ఎక్కువ‌గా ఈటీవీలో వ‌చ్చే ఈవెంట్ల‌లో క‌నిపిస్తూ ఉండేది. దాంతోపాటు హైప‌ర్ ఆది టీమ్ లో జ‌బ‌ర్ద‌స్త్ లో మెరిసింది. తన గ్లామర్‌, నటన, స్టైలిష్ లుక్స్ తో బుల్లి తెరపై రచ్చ రచ్చ చేస్తుంది భానుశ్రీ. ఇక సినిమాల్లో కూడా అప్పుడప్పుడు న‌టిస్తూనే ఉంది.

మొన్న ఏడు చేప‌ల క‌థలో ఆమె ప‌ర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. దాంతోపాటు ప్రస్తుతం మ‌రికొన్ని సినిమాల్లో కూడా న‌టిస్తోంది ఈ భామ‌. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఓ గుడ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. భాను త్వ‌ర‌లోనే పెళ్లి పీటలు ఎక్కనుందట. ఆమె చేసుకోబోయే వరుడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె చాలా షోల‌లో త‌న వ్యక్తిగత విష‌యాలు పంచుకునేది. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాన‌ని ముఖ్యంగా త‌న ఫ్రెండ్ కార‌ణంగానే ఇండ‌స్ట్రీలో రాణిస్తున్నానంటూ తెలిపింది.

Bhanu Sree soon to be married who is that person
Bhanu Sree

ఇప్పుడు ఆ ఫ్రెండ్ నే పెండ్లి చేసుకోబోతోందంట‌. అత‌న్ని చాలాకాలంగా ఆమె ప్రేమిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకే ఈ ఇద్ద‌రూ క‌లిసి త్వ‌ర‌లోనే పెళ్లితో ఒక్కటవ్వనున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఒక్కో ఈవెంట్‌కు ఆమె రూ.30వేల నుంచి రూ.50వేల దాకా తీసుకుంటోంది. హాట్ పెర్ఫార్మన్స్ ఇస్తే దానికిగాను దాదాపు రూ.60 వేల వరకూ తీసుకుంటుందట. పెళ్లి గురించి జరుగుతున్న చర్చ గురించి భాను ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment