Beauty Tips : మెడ భాగంలో ఉండే నలుపుదనం పోయి తెల్లగా మారాలంటే.. ఇలా చేయాలి..!

June 24, 2022 9:40 AM

Beauty Tips : సాధారణంగా మనకు అనేక రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. కొందరికి చర్మంపై ఎప్పుడూ ఏదో ఒక మచ్చలు వస్తుంటాయి. ఇంకొందరి చర్మం రంగు మారుతుంది. కొందరికి దురదలు వస్తుంటాయి. ఇలా రకరకాల చర్మ సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అలాగే కొందరికి మెడ భాగంలో నల్లగా మారుతుంది. దీనికి కారణాలు ఏమున్నప్పటికీ మెడ భాగంలో నల్లగా మారితే చూసేందుకు అసహ్యంగా ఉంటుంది. అంద విహీనంగా కనిపిస్తారు. కనుక నల్లగా ఉండే మెడ భాగాన్ని మామూలుగా చేసుకోవాలని చూస్తుంటారు. అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా మెడ భాగంలో ఉండే నలుపు పోదు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది. దీంతోపాటు ఆ భాగంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక టీస్పూన్‌ పెరుగులో 4-5 నిమ్మరసం చుక్కలు కలిపి మిశ్రమంగా చేయండి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల పాటు ఉంచిన తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.

Beauty Tips remove darkness on neck with these remedies
Beauty Tips

నిమ్మరసం, పాల మిశ్రమాన్ని మెడపై రాయాలి. పదిహేను నిమిషాల తరువాత సున్నిపిండి అప్లై చేయాలి. మళ్లీ 15 నిమిషాలు ఆగాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తున్నా మెడ భాగంలో ఉండే నలుపు పోతుంది.

కాస్తంత పెరుగులో కొద్దిగా బియ్యం పిండిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మెడ భాగంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మెడ భాగం అందంగా మారుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now