Beast Movie Trailer : తమిళ స్టార్ నటుడు విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు జంటగా నటిస్తున్న చిత్రం.. బీస్ట్. ఈ మూవీ లోంచి రెండు పాటలు ఈ మధ్యే విడుదల కాగా వాటిల్లో అరబిక్ కుతు అనే సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే.. ఈ పాటకు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సైతం డ్యాన్స్‌లు చేసి తమ ముచ్చటను తీర్చుకున్నారు. ఇక శనివారం ఈ సినిమాకు చెందిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇది ఒక రేంజ్‌లో ఉందని చెప్పవచ్చు.
బీస్ట్ మూవీలో విజయ్.. వీరరాఘవన్ అనే గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మొత్తం ఒక షాపింగ్‌మాల్‌లో జరుగుతుందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ప్రేక్షకులకు కావల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని ట్రైలర్‌ను చూస్తే స్పష్టమవుతోంది. ఒక మాల్‌లో చొరబడ్డ ఉగ్రవాదులు దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటారు. అయితే అనుకోకుండా అదే మాల్‌లో ఉన్న గూఢచారి వీరరాఘవన్ ఉగ్రవాదుల ఆటకట్టిస్తాడు. ఈ కథాంశంతో సినిమా తీశారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ మూవీ ట్రైలర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఏకంగా తమిళనాడులో థియేటర్ల వద్ద క్యూ కట్టారంటే బీస్ట్ ఫీవర్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాను సైతం ఈ ట్రైలర్ షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌ను లాంచ్ చేసిన 15 నిమిషాలకే దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 2.60 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక ఈ మూవీని ఏప్రిల్ 13వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…